ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో రూ. 5,600 కోట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గత కొంత కాలంగా పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం వారిని కలిశారు. IR, pending DA, surrender leaves, లు, పదవీ విరమణ బకాయిలపై మంత్రుల బృందం చర్చించింది. కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరం వారికి తీపి కబురు అందించారు. ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. త్వరలో రూ. 5600 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

pending లో ఉన్న నిధులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి బొత్స తెలిపారు. వీలైనంత త్వరగా పీఆర్సీని ప్రకటించాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే PRC committee వేశామని మంత్రి బొత్స గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని, వారు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం త్వరలో నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స వెల్లడించారు. 50 లక్షలు, విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.

Related News