వేసవి వచ్చిందంటే చల్లదనం కోసం ప్రతి ఒక్కరూ తహతహలాడుతారు. ఈ సీజన్‌లో కొన్ని బిజినెస్‌లు చేసే చాలామంది డిమాండ్‌లో ఉన్న వాటిని సరఫరా చేయొచ్చు. చిన్న పెట్టుబడితో మొదలు పెట్టి భారీ లాభాలు పొందొచ్చు. ఈ వేసవిలో రూ.20,000 పెట్టుబడి పెట్టగానే 3 నెలల్లో రూ.1.5 లక్ష వరకు సంపాదించే అవకాశాలు ఉన్న 6 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి.
1. జ్యూస్ & షేక్ స్టాల్
వేసవిలో మామిడికాయ, తరబూజ, మోసంబి లాంటి ఫ్రూట్ జ్యూసులకి భారీ డిమాండ్ ఉంటుంది. చిన్నగా స్టాల్ పెట్టి ఫ్రెష్ జ్యూస్, మిల్క్‌షేక్స్ అమ్మితే రోజుకు రూ.1,000-2,000 వరకు ఆదాయం వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడే ఆర్గానిక్ జ్యూసుల్ని కూడా చేర్చితే, హెల్త్ కాంశియస్ కస్టమర్స్ మరింత ఆదరిస్తారు.
2. ఐస్‌క్రీమ్ & కుల్ఫీ వ్యాపారం
వేసవిలో చల్లటి ఐస్‌క్రీమ్ కి బాగా డిమాండ్ ఉంటుంది. చిన్న స్టాల్ నుంచే స్టార్ట్ చేసి, చాక్లెట్, స్ట్రాబెర్రీ, మలై కుల్ఫీ వంటి వేరైటీ ఫ్లేవర్స్ అమ్మొచ్చు. ఒక్క రోజు రూ.2,000 వరకు అమ్మకాలతో, నెలకి రూ.60,000 వరకు ఆదాయం రావచ్చు.
Related News
3. కూలర్లు అద్దెకు ఇవ్వడం
ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు వేసవిలో చాలామందికి అవసరం. కాని కొంతమందికి కొనడం కష్టం. అలాంటి వారికి అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి లాభం రావచ్చు. ఒక్క కూలర్‌ను రూ.1500–2000కి కొనుగోలు చేసి, నెలకు రూ.800–1000 అద్దెకి ఇవ్వవచ్చు. 3 నెలల్లో పెట్టుబడి తిరిగొస్తుంది, తర్వాత లాభమే లాభం.
4. స్విమ్మింగ్ క్లాసెస్ లేదా పూల్ ట్రైనింగ్
వేసవిలో పిల్లలు, యూత్ ఎక్కువగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఆసక్తి చూపుతారు. మీ వద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటే ట్రైనింగ్ ఇవ్వొచ్చు. లేదంటే ఇతర పూల్‌లతో టై అప్ అయ్యి క్లాసులు నిర్వహించవచ్చు. ఒక్క బ్యాచ్ నుంచే రూ.10,000–15,000 వరకు ఆదాయం రావచ్చు.
5. హెల్త్ డ్రింక్స్ వ్యాపారం
లస్సీ, బట్టర్ మిల్క్, బెల్ జ్యూస్, నిమ్మకాయ నీళ్ళు వేసవిలో డిమాండ్‌లో ఉంటాయి. వీటిని చల్లగా తయారుచేసి, రుచికరంగా సర్వ్ చేస్తే మంచి లాభం వస్తుంది. రోజు రూ.500–1000 ఆదాయం వచ్చేదిగా ఉండొచ్చు.
6. ఆన్‌లైన్ లో చెప్పులు, సాండల్స్ అమ్మడం
వేసవిలో కూల్ ఫుట్‌వేర్‌కి డిమాండ్ పెరుగుతుంది. ట్రెండీ చెప్పులు, సాండల్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మితే లాభం బాగుంటుంది. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేస్తే యువత బాగా స్పందిస్తారు. చిన్నగా స్టార్ట్ చేసినా నెలకి రూ.30,000–40,000 ఆదాయం సాధ్యం.
ఇంకేం ఆలస్యం? ఈ వేసవిని బిజినెస్ టర్నింగ్ పాయింట్‌గా మార్చేయండి, చిన్న పెట్టుబడి… భారీ లాభం… ఇది మీ చేతిలోనే ఉంది..