నిర్మాత దిల్‌ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, ‘పుష్ప 2’ నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

55 బృందాలతో 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు.

Related News