కోటీశ్వరులు ఇంత మందా?.. IT శాఖ సంచలన ప్రకటన..

ఈ సంవత్సరం మార్చి 31నాటికి 3.24 లక్షల మంది వ్యక్తులు 1 కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్నట్లు తెలిపి ఐటీఆర్ దాఖలు చేశారని ఇన్కమ్ టాక్స్ డేటా వెల్లడైంది. ఇందులో 2.97 లక్షల మంది 1 నుండి 5 కోట్ల మధ్య ఆదాయం, 16,797 మంది 5 నుండి 10 కోట్ల మధ్య ఆదాయం, 10,184 మంది 10 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్లు తెలిపారు. కంపెనీలు, ఫర్ములు, HUFలు, ట్రస్టులు, AOPలు, ప్రభుత్వ సంస్థలతో సహా మొత్తం 4.68 లక్షల మంది 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు ఐటీఆర్ దాఖలు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇన్కమ్ టాక్స్ ఇండియా వెబ్సైట్లో 14.01 కోట్ల మంది రిజిస్టర్డ్ వినియోగదారులున్నారు. ఇందులో 12.91 కోట్ల మంది వ్యక్తిగత వినియోగదారులు. వీరిలో 11.86 కోట్ల మంది తమ ఆధార్ను లింక్ చేసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31నాటికి 9.19 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. వీటిలో 8.64 కోట్ల ఐటీఆర్లు ఇ-వెరిఫై అయ్యాయి.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఐటీఆర్ దాఖలు లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ITR-2 దాఖలులో 34.69% పెరుగుదల, ITR-1లో 0.54% పెరుగుదల, ITR-3లో 16.66% పెరుగుదల నమోదైంది. అన్ని ఐటీఆర్ ఫారములను కలిపి చూస్తే 7.81% మొత్తం పెరుగుదల నమోదైంది.

Related News

ఈ సంవత్సరం ఎక్కువ మంది హెచ్చు ఆదాయం నమోదు చేసుకున్నారని, ఎక్కువ మంది టాక్స్ ప్లానింగ్ చేసుకున్నారని ఈ డేటా సూచిస్తుంది. ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ దాఖలు చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇంకా ఐటీఆర్ దాఖలు చేయని వారు త్వరగా దాఖలు చేసుకోవాలని ఇన్కమ్ టాక్స్ శాఖ సూచిస్తోంది.

ఇంకా ఆలస్యం చేయకండి. టాక్స్ సేవింగ్స్ తో పాటు చట్టబద్ధతను కాపాడుకోండి.