OPPO A5 pro: బడ్జెట్లో బంగారం లాంటి ఆఫర్.. అదిరిపోయే ఫీచర్స్…

2025లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి OPPO నుంచి వచ్చిన మరో బడ్జెట్ హీరో ఇది. OPPO A5 ప్రో 4G ఫోన్ సింపుల్ యూజ్‌ కోసం మంచి ఛాయిస్. మంచి బ్యాటరీ, సన్నగా కనిపించే బాడీ, డీసెంట్ పనితీరు కలిపి బడ్జెట్‌లో సరిపడే ఫీచర్లతో రాబోయే రోజులలో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోన్ నిజంగా మీకు సరిపోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫోన్ డిజైన్‌ ఎలా ఉంది?

ఈ ఫోన్ చేతిలో పట్టుకునేందుకు చాల సన్నగా ఉంటుంది. దాని మందం 7.76 మిల్లీమీటర్లు మాత్రమే. బరువు 194 గ్రాములు. అందుకే ఫోన్ వాడేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఒక మంచి ఫీచర్ కూడా ఉంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇది చాలా అరుదు. దీని వల్ల ఫోన్ లుక్ హైఎండ్ ఫీల్ ఇస్తుంది.

డిస్‌ప్లే వివరాలు

6.67 అంగుళాల LCD స్క్రీన్ ఉంటుంది. కానీ రిజల్యూషన్ మాత్రం కేవలం 720 x 1604 పిక్సెల్స్ మాత్రమే. అంటే ఈ ధరలో వచ్చే ఫుల్ హెచ్‌డీ స్క్రీన్లతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. స్క్రీన్ డెన్సిటీ కూడా కేవలం 264 ppi మాత్రమే. కానీ ఒక ప్లస్ పాయింట్ ఉంది.

ఇది 1200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అంటే బయట సూర్యరశ్మిలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. రంగుల విషయానికొస్తే Vivid మోడ్‌లో 83% NTSC కలర్స్ ఉంటాయి. Natural మోడ్‌లో మాత్రం కాస్త తక్కువగా 71% ఉంటుంది. స్క్రోలింగ్ స్మూత్‌గా ఉండేందుకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది.

కెమెరా ఎలా ఉంది?

OPPO A5 ప్రో 4G వెనుక 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో వస్తుంది. వీడియోలు 1080pలో 60fpsలో రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 8MP మాత్రమే. సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్స్‌కి ఈ కెమెరా సరిపోతుంది. కానీ ఫోటో ప్రాముఖ్యత కలవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ కాదు. సాధారణ ఫోటోలు మాత్రం బాగానే వస్తాయి.

పెర్ఫార్మెన్స్ – రోజువారీ వాడకానికి సరిపోతుంది

ఈ ఫోన్ Qualcomm Snapdragon 6s Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. డైలీ యూజ్‌కి బాగానే పనిచేస్తుంది. కానీ హెవీ గేమింగ్ లేదా మల్టీటాస్కింగ్ చేస్తే కాస్త ఇబ్బంది ఫీలవుతుంది. ఫోన్‌లో 8GB RAM ఉంటుంది. దీనికి అదనంగా 8GB వర్చువల్ RAM కూడా ఉంది. 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది సరిపోతుంది. మైక్రో SD కార్డు సపోర్ట్ కూడా ఉంది. అంటే మెమరీ పెంచుకోవచ్చు.

బ్యాటరీ – పవర్‌ఫుల్ ప్యాక్

OPPO A5 ప్రో 4G ఫోన్‌కి 5800mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఒకటిన్నర రోజు టెన్షన్ లేకుండా వాడొచ్చు. దీనితో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే తక్కువ టైమ్‌లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కనెక్టివిటీ విషయాల్లో 4G, VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, NFC వంటివన్నీ ఉన్నాయి. కానీ ఇందులో వాటర్ ప్రూఫ్ ఫీచర్ లేదు. FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా లేదు. ఇవి కొన్ని యూజర్లకి మైనస్ పాయింట్స్ కావచ్చు.

ధరకి తగ్గ రేంజ్‌లో ఉందా?

OPPO A5 ప్రో 4G ఒక బడ్జెట్ ఫోన్. దీని ప్రైస్ 15 వేలలోపే ఉండొచ్చు. కానీ ఇందులో వచ్చే ఫీచర్లు గమనిస్తే, ఎక్కువ అంచనాలు పెట్టకపోతే డైలీ వాడకానికి సరిపోతుంది. పెద్ద స్క్రీన్, సన్నగా కనిపించే బాడీ, పెద్ద బ్యాటరీ ఇవన్నీ బేసిక్ యూజర్స్‌కి ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ కెమెరా, హై రెజల్యూషన్ డిస్‌ప్లే వంటివి కావాలంటే మీరు మరో ఫోన్ వైపు చూసిన మంచిది.

ముగింపు

OPPO A5 ప్రో 4G ఫోన్ బడ్జెట్ ఫోన్ మార్కెట్‌లో ఓ మంచి ఎంట్రీ. రోజువారీ ఫంక్షన్ల కోసం ఇది మంచి ఆప్షన్. స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్ లేదా ఎక్కువగా వీడియోలు చూడని వారికీ ఇది మంచి ఎంపిక.

ఫ్యాన్సీ ఫీచర్లకంటే పని జరిగితే చాలు అనుకునే వారికి ఇది బెస్ట్ బడ్జెట్ ఫోన్. మరి మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడే కొనండి, తర్వాత మిస్ అయ్యేది మిగిలిపోతుంది..