ఇంట్లో ఆడవారు ఉదయం స్కూల్ కి వెళ్లే తమ పిల్లలకు, ఆఫీసుకు వెళ్లే తమ భర్తకు లంచ్ బాక్స్ లు పెట్టడం కోసం ఎంతో హడావిడిగా వంటలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒకసారి కూరలో కారం ఎక్కువగా, తక్కువగా అవుతుంది. కారం తక్కువ అయితే పర్లేదు కానీ ఎక్కువ అయితే భోజనం సరిగా చేయలేరు. కూరలో కారం ఎక్కువైనప్పుడు కింది చిట్కాలు ట్రై చేస్తే సరిపోతుంది.
పెరుగు
కూరలో కారం ఎక్కువైతే పిల్లలు అన్నం తినడానికి ఇష్టపడరు. పైగా కారం ఎక్కువైతే ఏడుస్తారు కూడా. కావున ఈ టైంలో పెరుగుని కాస్త చిలికి కూరలో కలిపి ఒక రెండు నిమిషాల పాటు కూరను వేడి చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే కూరలో కారం బ్యాలెన్స్ అవుతుంది.
కొబ్బరి పాలు
మరొక చిట్కా కూరలో కారం ఎక్కువైపోతే కొబ్బరిపాలు ఉన్న, కొబ్బరి పొడి ఉన్న కూరలో వేసి కలపండి. దీంతో కూరలో కారం తగ్గుతుంది. అంతేకాకుండా రుచి కూడా మొత్తం మారిపోతుంది. మంచి గ్రేవీ కూడా వస్తుంది.
బంగాళదుంప
బంగాళదుంపను ముక్కలుగా కోసి కూరలో వేసి కాసేపు ఉడికించండి. ఇలా చేస్తే కూరలో కారం బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీ వంటింట్లో క్యాప్సికం, క్యారెట్స్, బటానీలు ఉన్నా కూడా కలపవచ్చు. కొద్దిగా నీళ్లు వేసి ఉడికిస్తే కూరలో కారం తగ్గిపోతుంది.
టమాట
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే టమాటాలు కూడా కూరలో కారాన్ని తగ్గిస్తాయి. టమాటాలను ప్యూరీలా చేసి కొరలో కలిపి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కారం తగ్గి రుచి పెరుగుతుంది. ఇందులో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.