రూ.6,000 SIP తో 2 కోట్లు సాధ్యమేనా? ఫాస్ట్ గా కోటీశ్వరుడు అయ్యే లెక్కలు…

సంపాదనతో పాటు పెట్టుబడులు కూడా బాగా ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ నాటికి కోట్లు కూడబెట్టడం సాధ్యమే. చిన్న మొత్తంలో కానీ క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, Power of Compounding తో ఎంత త్వరగా రూ.2 కోట్లు రావొచ్చో తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SIP అంటే ఏమిటి?

SIP (Systematic Investment Plan) అనేది నియమిత పెట్టుబడి పద్ధతి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. దీని ద్వారా పొదుపుతో పాటు పెట్టుబడి కూడా అవుతుంది.

రూ.2 కోట్లు సాధించడానికి ఎంత టైం పడుతుంది?

రూ.6,000 SIP → 31 సంవత్సరాలు. రూ.9,000 SIP → 28 సంవత్సరాలు. రూ.12,000 SIP → 25 సంవత్సరాలు

Related News

SIP లెక్కలు – అసలు మీరు ఎంత పెట్టి, ఎంత పొందుతారు?

రూ.6,000 SIP- మొత్తం పెట్టుబడి: రూ.22,32,000. లాభం: రూ.1,85,48,739. అంతిమ నిధి: రూ.2,07,80,739. రూ.9,000 SIP- మొత్తం పెట్టుబడి: రూ.30,24,000. లాభం: రూ.1,88,87,013. అంతిమ నిధి: రూ.2,19,11,013. రూ.12,000 SIP- మొత్తం పెట్టుబడి: రూ.36,00,000. లాభం: రూ.1,68,26,479. అంతిమ నిధి: రూ.2,04,26,479

ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు

SIP మొదలుపెట్టడానికి కనీసం రూ.100 కావాలి. పొదుపు చేసే అలవాటు చిన్న వయస్సులోనే పెంచుకుంటే ఎక్కువ లాభాలు పొందొచ్చు. మార్కెట్ ఎప్పుడూ నిలకడగా ఉండదని తెలుసుకోవాలి. కానీ దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు.

మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారా?

మొదట చిన్న మొత్తంలో SIP ప్రారంభించండి. తర్వాత ఆ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతే 2 కోట్లు కలలు కాదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇప్పుడే ముందడుగు వేసేయండి.