భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజన అనేది దేశంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం రూపొందించిన అద్భుతమైన పథకం. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆసుపత్రి ఖర్చులకు ₹5 లక్షల వరకు సాయం పొందొచ్చు… దీన్ని ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు.
మన దేశంలో చాలా మంది ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్ల వైద్య ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఖర్చుల వల్ల జీవిత పొదుపులు ఖాళీ అవుతుండటంతో, ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మీరు భారీ ఆసుపత్రి ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఎవరికి లాభం?
- పేద & మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య భీమా అందించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
- ₹5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.
- ప్రభుత్వ & ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.
- కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తించవచ్చు.
- గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, శస్త్రచికిత్సలు (సర్జరీలు) వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందొచ్చు.
- ఆర్థికంగా వెనుకబడిన వారు, రోజువారీ కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు, కర్మికులు ఈ పథకం కింద చేరవచ్చు.
పూర్తి కుటుంబానికి ఉపయోగమా?
- చాలా మందికి అనుమానం ఈ పథకం కుటుంబంలోని అందరికీ వర్తిస్తుందా?
- ప్రభుత్వం దీనిపై ఏ ప్రత్యేక పరిమితి విధించలేదు.
- అర్హత గల కుటుంబ సభ్యులందరికీ ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
- ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది కూడా వైద్యం పొందవచ్చు.
అర్హత ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు ఈ పథకం కింద అర్హులా? తెలుసుకోవాలంటే ఈ స్టెప్పులు పాటించండి:
- మీ సమీప జన్ సేవ కేంద్రం (CSC) కి వెళ్లండి.
- మీ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించండి.
- అధికారులు మీ పత్రాలు పరిశీలించి అర్హత గురించి తెలియజేస్తారు.
- అర్హత ఉన్నట్లయితే మీకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు మంజూరు అవుతుంది.
- ఈ కార్డు ఉపయోగించి మీరు దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఉచిత వైద్యం పొందవచ్చు.
అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు (అవసరమైతే)
- వోటర్ ఐడీ
- రేషన్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్ (అవసరమైతే)
- మొబైల్ నెంబర్
ఇదే మీ ఆరోగ్య భద్రతకు అవకాశం
- వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
- ప్రభుత్వం ఇచ్చే ₹5 లక్షల ఆరోగ్య భీమాను వాడుకోకపోతే అది మీ నష్టమే.
- ఈ పథకాన్ని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి & వైద్యం ఖర్చులను భారం చేసుకోకండి.
- మీరు అర్హులా తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప CSC కేంద్రానికి వెళ్లండి.
ఆలస్యం చేయొద్దు… ఇప్పుడే అర్హత చెక్ చేసుకొని మీ ఆరోగ్య భద్రతను పొందండి.