SRH అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ టికెట్లు విడుదల
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ సమీపిస్తోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం మొత్తం 13 వేదికలు సిద్ధం అయ్యాయి. దీంతో, క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా, గత సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సన్‌రైజర్స్ మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో, అభిమానులు టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 22, 27 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న రెండు మ్యాచ్‌లకు గాను టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు ఐపీల్ నిర్వాహకులు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో ప్రతి రెండు టిక్కెట్లకు ఒక SRH జెర్సీని ఉచితంగా అందిస్తామని సన్‌రైజర్స్ ప్రకటించింది. అయితే, ఈసారి ఆన్‌లైన్‌లో టికెట్ ధరలు రూ.750 నుండి ప్రారంభమై గరిష్టంగా రూ.30,000 వరకు ఉంటాయి. అయితే, సన్‌రైజర్స్ అభిమానులు టిక్కెట్లు కొనడానికి పెద్ద మొత్తంలో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్ ధరలు
జియో మొహమ్మద్ అజారుద్దీన్ నార్త్ ఫస్ట్ టెర్రస్ – ₹750
జియో మొహమ్మద్ అజారుద్దీన్ నార్త్ సెకండ్ టెర్రస్- ₹750
డ్రీమ్ 11 సౌత్ వెస్ట్ ఫస్ట్ టెర్రస్- ₹1850
డ్రీమ్ 11 సౌత్ వెస్ట్ సెకండ్ టెర్రస్- ₹1550
కెంట్ సౌత్ ఈస్ట్ ఫస్ట్ టెర్రస్ – ₹1850
కెంట్ సౌత్ ఈస్ట్ సెకండ్ టెర్రస్- ₹1550
డ్రీమ్ 11 వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్- ₹2750
రైజర్స్ లాంజ్ నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ – ₹16000
సౌత్ పెవిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్ప్ బాక్స్‌లు- ₹30000
నార్త్ పెవిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్ప్ బాక్స్‌లు- ₹22000
ఆల్ సీజన్స్ సౌత్ వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్- ₹8000
ఆరెంజ్ ఆర్మీ లాంజ్ – నార్త్ ఈస్ట్ గ్రౌండ్ ఫ్లోర్- ₹16000
BKT టైర్స్ నార్త్ స్టాండ్ మొదటి అంతస్తు- ₹6500
లబ్బీ పంప్స్ వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్- ₹4500
BKT టైర్స్ ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్- ₹4500