₹2,000 పెట్టుబడితో ఎంత లాభం?
మీరు నెలకు ₹2,000 RDకి పెట్టుబడి పెడితే, ఒక ఏడాదికి ₹24,000, ఐదు సంవత్సరాలకు ₹1,20,000 సేవ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న 6.7% వడ్డీ రేటు ప్రకారం, మొత్తం ₹22,732 వడ్డీ రాబడిగా లభిస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత మీ ఖాతాలో మొత్తం ₹1,42,732 జమ అవుతుంది.
₹3,000 పెట్టుకుంటే ఎంత వస్తుంది?
మీరు నెలకు ₹3,000 RDలో సేవ్ చేస్తే, ఒక ఏడాదికి ₹36,000, ఐదు సంవత్సరాలకు ₹1,80,000 పెట్టుబడి అవుతుంది. పోస్టాఫీస్ RD క్యాలికులేటర్ ప్రకారం, 6.7% వడ్డీ రేటుతో మీకు ₹34,097 వడ్డీ లభించి, టోటల్ ₹2,14,097 మీ అకౌంట్‌లో చేరుతుంది. చిన్న పొదుపుతో ఎక్కువ లాభం పొందాలనుకునేవారికి ఇది గోల్డ్‌మైన్ ఆప్షన్.
₹5,000 పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించండి
మీరు నెలకు ₹5,000 RD పెట్టుబడి పెడితే, ఐదు సంవత్సరాలకు మొత్తం ₹3,00,000 సేవ్ అవుతుంది. 6.7% వడ్డీ రేటుతో ₹56,830 వడ్డీ రాబడి వస్తుంది. అంటే 5 ఏళ్లకు మీరు ₹3,56,830 తీసుకోవచ్చు. మధ్యంతర కాలంలో ఒక భారీ మొత్తాన్ని కూడగట్టుకోవాలనుకునే వారికి ఇది బంగారు అవకాశమే.
Related News
ప్రతి 3 నెలలకు వడ్డీ రేటు సమీక్ష
ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు స్కీముల వడ్డీ రేటును రివ్యూ చేస్తుంది. అక్టోబర్ 1, 2023న పోస్టాఫీస్ RD వడ్డీని 6.5% నుంచి 6.7%కి పెంచారు. అప్పటి నుంచి ఏ మార్పు జరగలేదు.
వడ్డీ మార్పులు మీ RDపై ప్రభావం చూపవు
మీరు ఏ వడ్డీ రేటుతో RD స్టార్ట్ చేసారో, అదే వడ్డీ 5 ఏళ్లపాటు కొనసాగుతుంది. మధ్యలో వడ్డీ రేట్లు పెరిగినా, తగ్గినా, మీ పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది ఇన్వెస్టర్లకు పెద్ద రక్షణ, ఎందుకంటే వారు ఓ నిర్ధిష్టమైన ప్లానింగ్‌తో పొదుపులను కొనసాగించవచ్చు.
మీ భవిష్యత్తు కోసం ఒక సురక్షితమైన పొదుపు ప్రణాళిక కావాలంటే, పోస్టాఫీస్ RDని తప్పక ఉపయోగించుకోండి. చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద లాభాలు పొందే అవకాశం మీకోసం అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే RD ఖాతా ఓపెన్ చేసి, మీ పొదుపు ప్రస్థానాన్ని ప్రారంభించండి.