వెండి కొనాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నవారికి ఇప్పుడు ఇది గోల్డెన్ ఛాన్స్. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడి నిపుణుడు, Rich Dad Poor Dad పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇప్పుడు వెండిపై సంచలన ప్రకటన చేశాడు. గోల్డ్ ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉంది. బిట్‌కాయిన్ తన పోర్ట్‌ఫోలియోలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు చవకగా ఉన్న వెండి కోనాల్సిన టైమ్ ఇదే అంటున్నాడు.
ఇప్పుడు వెండి ధర ఎంతంటే?
ప్రస్తుతం వెండి యూఎస్ మార్కెట్‌లో $35 చొప్పున ట్రేడ్ అవుతోంది. ఇది ఇప్పటి వరకూ వచ్చిన గరిష్ఠ ధర కన్నా సగం మాత్రమే. అంటే ఇప్పటికీ ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ఈ ధరలపై వెండి కొనడం వలన రాబోయే రోజుల్లో భారీ లాభాలు పొందే ఛాన్స్ ఉందని కియోసాకి అంటున్నాడు.
వెండి ధర $70కి వెళ్లే ఛాన్స్ ఉందట
ఇంకొన్ని నెలల్లో వెండి ధర డబుల్ అయ్యే అవకాశం ఉందని కియోసాకి గట్టిగా నమ్ముతున్నాడు. $35 నుండి $70కు వెండి చేరుతుందని అంచనా వేస్తున్నాడు. ఇది సాధ్యమే అంటున్నారు ఎందుకంటే పెట్టుబడిదారుల్లో వెండి మీద ఆసక్తి పెరుగుతోంది. గోల్డ్ ధరలు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి కాబట్టి చిన్న పెట్టుబడిదారులు వెండి వైపు చూస్తున్నారు.
Related News
రాబర్ట్ కియోసాకి పెట్టుబడి మంత్రం ఏమిటంటే
“నువ్వు కొనేటప్పుడు లాభం వస్తుంది, అమ్మేటప్పుడూ కాదు” అంటాడు కియోసాకి. ఆయన అనుభవాల ప్రకారం చిన్న చిన్న మొత్తాల్లో, క్రమంగా పెట్టుబడి పెట్టడం వల్లే పెద్ద సంపద కూడగట్టగలమంటాడు. ఒక్కసారిగా అమ్మేస్తే లాభం పొందలేమని చెప్తున్నాడు. ఈ మంత్రం ద్వారా ఆయన ఎంతో సంపద సృష్టించాడు.
2035 నాటికి బిట్‌కాయిన్ $1 మిలియన్, గోల్డ్ $30,000, వెండి $3,000?
ఇంకొక షాకింగ్ ఫోర్‌కాస్ట్ ఇది – రాబర్ట్ కియోసాకి అంచనా ప్రకారం 2035 నాటికి బిట్‌కాయిన్ $1 మిలియన్ దాటుతుందని చెప్తున్నాడు. గోల్డ్ కూడా $30,000కి చేరుతుందని, వెండి ఒక్క కాయిన్ ధర $3,000 అవుతుందని చెబుతున్నాడు. ఇవన్నీ మనం ఊహించలేని స్థాయిలు. అయితే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దక్కుతుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు.
వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి, నేర్చుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి అని కియోసాకి సలహా ఇస్తున్నాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఆలోచించకూడదు. భయంతో వెనక్కి తగ్గితే అవకాశం కోల్పోతారు. ఇప్పుడు వెండి కొనడమంటే భవిష్యత్‌కు దారి వేసినట్టే అంటున్నారు.
ఫైనల్ గా…
ఇప్పటికే మార్కెట్లలో వెండి ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. త్వరలోనే ఇది డబుల్ కావచ్చు. అంతే కాదు, దీర్ఘకాలంలో వెండి మీకు జీవితాంతం ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గంగా మారుతుంది. ఇప్పటినుంచే స్టడీ చేయండి, మార్కెట్‌ను అర్థం చేసుకోండి.
చిన్న మొత్తంలోనైనా వెండి కొనడం వల్ల డిసిప్లైన్డ్ పెట్టుబడి ప్రారంభం అవుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెప్తున్న మాటలను పట్టించుకోకపోతే… మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకెప్పటికీ కలగకపోవచ్చు!