2025-26:ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్ క్యాలెండర్ ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పనిదినాలు, సెలవులు, పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గురువారం ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ప్రధాన వివరాలు:

  • తరగతులు ప్రారంభం2 జూన్ 2025 (మొదటి & రెండవ సంవత్సరం).
  • మొత్తం పనిదినాలు226 రోజులు.
  • కళాశాలల చివరి రోజు31 మార్చ్ 2026.
  • తరగతులు మళ్లీ ప్రారంభం1 జూన్ 2026.

పరీక్షల షెడ్యూల్:

  • అర్ధ సంవత్సర పరీక్షలు10 నవంబర్ – 15 నవంబర్ 2025.
  • ఫ్రీ ఫైనల్ పరీక్షలుజనవరి 2026 చివరి వారం.
  • ప్రాక్టికల్ పరీక్షలుఫిబ్రవరి 2026 మొదటి వారం.
  • పబ్లిక్ ఎగ్జామ్‌లు (మెయిన్ పరీక్షలు)మార్చి 2026 మొదటి వారం.

ప్రధాన సెలవులు:

  • దసరా సెలవులు28 సెప్టెంబర్ – 5 అక్టోబర్ 2025 (8 రోజులు).
  • సంక్రాంతి సెలవులు11 జనవరి – 18 జనవరి 2026 (8 రోజులు).
  • వేసవి సెలవులు1 ఏప్రిల్ – 31 మే 2026 (2 నెలలు).

ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడండి.