తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ను మరింత మెరుగుపరచింది. ఈ పథకానికి సంబంధించిన సమస్యలు లేదా సందేహాలు ఉండే వారు Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను నిర్మించనుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మించనున్నారు. స్వంత స్థలమున్న అర్హులైన లబ్ధిదారులకు రూ. 5 లక్షలు నాలుగు విడతలుగా అందించనున్నారు.
Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్ గురించి
ఇందిరమ్మ హౌసింగ్ పథకానికి సంబంధించి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌ను గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
Related News
ఈ వెబ్‌సైట్ ద్వారా హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తరువాత SMS ద్వారా మీ ఫిర్యాదు స్థితి వివరాలు మీ ఫోన్‌కు వస్తాయి.
Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్ లక్ష్యం
- తెలంగాణ ప్రజలు తమ ఫిర్యాదులను ఈ వెబ్‌సైట్ ద్వారా తేలికగా అందించగలగాలి.
- ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ను మరింత పారదర్శకంగా చేయడం.
- అర్హులైన లబ్ధిదారులకు పథకాన్ని త్వరగా అందించడం.
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫిర్యాదు చేయాలంటే?
Step 1: Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
Step 2: Dashboard పేజీ ఓపెన్ అయిన తర్వాత “Grievance” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3: Grievance Entry అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
Step 4: మీ వివరాలను ఫిల్ చేసి “Submit” బటన్ ప్రెస్ చేయండి.
ఫిర్యాదు స్థితిని ఎలా చెక్ చేసుకోవాలి?
Step 1: Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Step 2: “Grievance” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3: “Grievance Status” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
Step 4: మీ వివరాలను ఫిల్ చేసి “Submit” బటన్ క్లిక్ చేయండి.
Step 5: మీ ఫిర్యాదు స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ వెబ్‌సైట్ ద్వారా తెలంగాణ ప్రజలు తమ ఇళ్లకు సంబంధించిన సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. పథకం గురించి పూర్తి సమాచారం పొందడానికి Indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి!