IND VS ENG 3rd ODI: గిల్ సూపర్ ఫాస్ట్ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా మూడు రికార్డులు బ్రేక్..

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతను అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ (100) చేశాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీనితో, అతను తన 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 50 ఇన్నింగ్స్‌లలో ఏడు వన్డే సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కూడా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ మరో రికార్డును కూడా సాధించాడు. వన్డే క్రికెట్‌లో 2500 పరుగుల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ అతని రికార్డును బద్దలు కొట్టాడు.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అరుదైన రికార్డు..

మూడో వన్డేలో 51 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో ఇది అతని హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ.

మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు.

గిల్ కంటే ముందు, దిలీప్ వెంగ్ సర్కార్ శ్రీకాంత్ (vs శ్రీలంక vs 1982లో), (vs శ్రీలంక vs 1985లో), మహ్మద్ అజారుద్దీన్ (vs శ్రీలంక vs 1993లో), ధోని (vs ఆస్ట్రేలియా vs 2019లో), శ్రేయాస్ అయ్యర్ (vs న్యూజిలాండ్ vs 2020లో), ఇషాన్ కిషన్ (vs వెస్టిండీస్ vs 2023లో), మరియు శుభ్‌మాన్ గిల్ (vs ఇంగ్లాండ్ vs 2025లో) ఈ ఘనత సాధించారు.