ఈ మధ్య చాలా మంది హార్ట్ ఎటాక్‌లు వచ్చి… చిన్న వయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. మరి గుండె ఆరోగ్యంగా ఉండి…లబ్‌డబ్ అంటూ…క్రమం తప్పకుండా కొట్టుకోవాలంటే…ఏం చెయ్యాలి…ఎలాంటి ఫుడ్ తినాలి..?
మన శరీరంలో అతి ముఖ్యమైన ఆర్గాన్ హార్ట్. నిరంతరం పని చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… మనం రోజూ వ్యాయామం చేయాలి. టైంకు నిద్రపోవాలి. శరీరానికి కావాల్సినంత నీళ్ళు తాగాలి.
Related News
పౌష్టికాహారం తీసుకోవాలి. మనం తీసుకునే కొన్ని రకాల చెడు ఆహారం వల్లనే చాలా వరకు గుండె సమస్యలు వస్తున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాలు లేని…జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం వల్ల గుండెకు నష్టం జరుగుతోంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో…తప్పకుండా జాగ్రత్తలను పాటించాలి.
మన గుండె హెల్దీగా ఉండేందుకు రోజు ఎక్సర్‌సైజ్‌తో పాటు మంచి ఫుడ్ తినాలి. అందులో రెడ్ కలర్ ఫుడ్ తీసుకుంటే…అవి గుండె ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుందాం…
ఎర్రగా చూడగానే చిన్నపిల్లలకు నోరూరించేలా… తినాలనిపించే ఈ ఫుడ్స్ రోజు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. హార్ట్ ఎటాక్ రావద్దంటే…ప్రతి నిత్యం ఎరుపు రంగు ఆహరం తీసుకోవడం తప్పనిసరి…వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. టమాటాలు, యాపిల్, ఎరుపు రంగులో ఉండే కాప్సికం, స్ట్రాబెర్రీలు, బీట్‌రూట్లు తినడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది.
ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం తినండం వల్ల… శరీరంలో రక్తం ఎక్కువగా తయారవడంతో…రక్త హీనత ఉండదు. ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో ఎ, సీ విటమిన్లతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో రక్త సరఫరాను పెంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది…కాబట్టి గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు…శరీరంలోని రక్త నాళాల్లో వాపులు లేకుండా చేస్తుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా దానిమ్మ పండ్లను కూడా రోజూ ఆహారంలో తీసుకోవాలి. దానిమ్మలో ఉండే ప్యూనికాలాగిన్స్, పాలిఫినాల్స్ రక్త సరఫరాను మెరుగు చేస్తాయి. రక్త నాళాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానిమ్మ పండుతో హార్ట్ ఎటక్‌కు బ్రేక్ వెయ్యొచ్చు.
ఇక స్ట్రాబెర్రీలు చూడగానే అందరికీ నోరూరుతుంది. వీటిలో యాంథో సయనిన్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. చెర్రీ పండ్లు కూడా ఎరుపు రంగులో నిగనిగలాడుతాయి. వీటిని తింటే కూడా హార్ట్ బీట్ బాగుంటుంది.
బీట్ రూట్…అవును బీట్ రూట్ మనకు అన్ని సీజన్లలో దొరకుతుంది. రోజూ బీట్ రూట్ తిన్నా…జ్యూస్ చేసుకుని తాగినా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. బీట్‌రూట్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను కాపాడతాయి. దీంతో బ్లడ్ సర్క్యూలేషన్ బాగుండటంతో…బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాన్ని రోజూ తింటూ మీ గుండెను భద్రంగా కాపాడుకోవచ్చు. మంచి ఆహారాన్ని తిని మీ గుండెను భద్రంగా కాపాడుకోండి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి…ఆహారంతో పాటు పనిలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్…కూడా చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి…మెడిటేషన్ మీ నిత్య జీవితంలో భాగం చేసుకోండి. మెడిటేషన్ గురించి మరోసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.