Good news for women. ఇప్పటికే మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతున్న సంగతి తెలిసిందే.
అయితే వీరికి మరింత సాయం అందించడానికి Revanth Sarkar కీలక నిర్ణయం తీసుకుంది.
తమ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అందించారు. Dwakra group ల్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి పేరు మీద ఉన్న మొత్తాన్ని మాఫీ చేసేలా వారి పేరుతో బీమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. అంటే మహిళ కుటుంబంపై ఎలాంటి భారం పడకుండా మొత్తం రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
Dwakra loans కాకుండా Stri Nidhi ద్వారా రుణం తీసుకున్నా ఈ బీమా వర్తిస్తుంది. రుణం తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో మరణిస్తే వారి కోసం తీసుకున్న రుణం రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది.
అలాగే మహిళా గ్రూపులో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మృతుల కుటుంబానికి ప్రభుత్వం ప్రమాద బీమా కింద రూ.10 లక్షల వరకు అందజేస్తుంది. కానీ ఒక మహిళ గ్రూపుగా రుణం తీసుకుంటే, ఆమె కుటుంబం మొత్తం చెల్లించాలి. ఇది బీమా పరిధిలోకి రాదు