Food Eating: ఈ దిక్కుగా కూర్చుని అన్నం తింటే..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే !

ఇల్లు కట్టేటప్పుడు వాస్తు పాటిస్తే సరిపోతుందని కొందరు అనుకుంటారు. ఇంటి నిర్మాణం మాత్రమే కాదు జీవితంలో ప్రతి ఒక్కటీ వాస్తు ప్రకారం జరగాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు వాస్తు శాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఇల్లు కట్టుకోవడానికి వాస్తు పాటించినట్లే ఇంట్లో భోజనం కూడా వాస్తు ప్రకారం ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనం ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తున్నామో దానిపైనే మన శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ దిశలో అస్సలు కూర్చోకూడదు

వాస్తు ప్రకారం దక్షిణం లేదా పడమర ముఖంగా భోజనం చేయడం మంచిది కాదు. ఈ దిక్కున కూర్చొని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు నియమాలు చెబుతున్నాయి. ఇంట్లో సంపద నిలవదని కూడా చెబుతోంది. టెన్షన్, అశాంతి, ఆరోగ్యం బాగోలేదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందుకోసమే ఇంటి పెద్దలు ఎవరినైనా ఆపి తిరగేసి కూర్చోమని అడుగుతారు.

ఈ దిక్కున కూర్చుని భోజనం చేస్తే ఐశ్వర్యం 

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో భోజనాల గది పశ్చిమ దిశలో ఉండాలి. తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేస్తే విద్య వృద్ధి చెందుతుందని, సంపదలు పెరుగుతాయని, జీవితం బాగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే తూర్పు దిక్కుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయడం మంచిది.

భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు, తలకి ఎలాంటి బట్టలు వేసుకోకూడదు. భోజనం చేసే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం మంచిదని, వీలైతే నేలపై చాప పరచి కూర్చుని భోజనం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.