ఈ మధ్య కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల కొంతమందికి రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు.
నిద్ర లేకపోవడం వల్ల కళ్ల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. కాబట్టి నిద్రలేమిని దూరం చేసుకోవడం చాలా అవసరం. కానీ ఇప్పుడు చెప్పబోయే బంగారు పాలు అద్భుతమైన రీతిలో సహాయపడతాయి. రాత్రిపూట ఈ బంగారు పాలు తాగితే నిద్రలేమి పోతుంది.
గోల్డెన్ మిల్క్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
Related News
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క, అర టేబుల్ స్పూన్ మిరియాలు, ఐదు యాలకులు, అంగుళం దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్సులో భద్రపరుచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు ఆవు పాలు పోయాలి.
పాలు కొద్దిగా మరిగిన తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకున్న పొడిని వేసి నాలుగు నిమిషాలు మరిగించాలి.
చివరగా, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరో నిమిషం మరిగించి తరువాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మన గోల్డెన్ మిల్క్ రెడీ ..
ఈ పాలను గోరువెచ్చగా అయిన చల్లగా అయినా తీసుకోవచ్చు . ఈ గోల్డెన్ మిల్క్ ను రాత్రిపూట ఒక గ్లాసు చొప్పున తాగితే.. నిద్రలేమి సమస్యను చాలా తేలికగా అధిగమించవచ్చు.
ఈ పాలు నిద్రను కలిగించే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్రశాంతమైన మరియు చక్కని నిద్రను అందిస్తుంది.
ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వారు రాత్రిపూట ఖచ్చితంగా ఈ గోల్డెన్ మిల్క్ ను తీసుకోవాలి.
అంతేకాకుండా, ఈ పాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఎముకలు మరియు కండరాలను బలపరుస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.