
2025-26 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల నియామకానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై 21తో ముగిశాయి. అయితే, IBPS ఈ గడువును పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025-26 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై 21తో ముగిశాయి. అయితే, IBPS ఈ గడువును పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం, IBPS దరఖాస్తు గడువును మరో వారం పొడిగించింది.
దీనితో, ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి జూలై 28, 2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను నియామక పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయబడతాయి. బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
[news_related_post]ఆంధ్రప్రదేశ్ ఎం-ఫార్మసీ అడ్మిషన్ల కోసం ప్రత్యేక షెడ్యూల్ 2025-26
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ఎం-ఫార్మసీ కోర్సులకు ఇంకా అనుమతి రాకపోవడంతో, ఏపీ పీజీఈసీఈటీలోని ఎం-టెక్ కోర్సులకు మాత్రమే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి తెలిపారు. ఫార్మసీలో అడ్మిషన్లకు సంబంధించి త్వరలో ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.