ఇకపై ‘హ్యుందాయ్ కోనా ఈవీ’ కొత్త కారు కొనలేరు.. ఎందుకంటే?

భారతదేశంలో electric vehicles ఉత్పత్తి మరియు వినియోగం పెరుగుతున్న తరుణంలో కొత్త వాహనాలు కూడా విడుదల అవుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ తరుణంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థ Hyundai India తన ప్రముఖ Kona Electric’ in India ని భారతదేశంలో నిలిపివేసింది.

అయితే కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో కొత్త తరం కోనా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అయితే కోనా ఎలక్ట్రిక్‌కు బదులుగా హ్యుందాయ్ కంపెనీ ”Creta Electric’ car ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ తన బ్రాండ్ వెబ్‌సైట్ నుండి కోనా ఎలక్ట్రిక్ కారును తొలగించింది. అయితే, డీలర్ల వద్ద విక్రయించబడని స్టాక్‌పై కూడా కంపెనీ మంచి ఆఫర్లను అందజేస్తున్నట్లు సమాచారం. కోనా ఎలక్ట్రిక్ కార్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత, New  Kona Electric Cars ను కొనుగోలు చేసే అవకాశం ఉండదు.

The Hyundai Kona electric car  CKD యూనిట్లుగా భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో కంపెనీ ఈ కారును విడుదల చేసినప్పుడు రూ. 25.30 లక్షలు ప్రారంభ ధర. అయితే, కంపెనీ ఇటీవల రూ. 2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

ఎన్ని డిస్కౌంట్లు ప్రకటించినా ప్రత్యర్థుల నుంచి పోటీ పెరుగుతోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  Hyundai Kona electric car అద్భుతమైన డిజైన్‌తో 39.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఇది ముందు ఇరుసుపై ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 136 హార్స్‌పవర్ మరియు 395 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 452 కిమీల రేంజ్‌ను అందించగలదని ARAI ధృవీకరించింది. కాబట్టి వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.