రైల్వే లో భారీగా ఉద్యోగాలు.. 9000 ఉద్యోగాలకి నోటిఫికేషన్. వివరాలు ఇవే..

RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త ప్రకటించింది. పాట్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దాదాపు 9000 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా రిక్రూట్మెంట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 8 చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://indianrailways.gov.in/ లేదా https://www.rrbpatna.gov.in/ వెబ్సైట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంకా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి ITI, Diploma/Degree in Engineering ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే.. General, OBC, EWS అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. మహిళలు, SC, ST, ఇతర reserved అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. Computer Based Test-1, CBT-2, Document Verification మరియు Medical Test ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు ఎంపికైన Technician Grade -1 అభ్యర్థులకు రూ.29,200, Technician Grade -3 అభ్యర్థులకు రూ.19,900 లభిస్తుంది. Patna Railway Recruitment Board (RRB) computer ఆధారిత పరీక్షలను October/December లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Related News