young rebel star Prabhas. నటిస్తున్న తాజా చిత్రం Kalki 2898AD. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే Hollywood range లో ఉండబోతుందనిపిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా June 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే Kalki 2898 AD సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. అదే సమయంలో టికెట్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, ఒక ప్రాంతంలో టిక్కెట్ ధరలు వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Kalki 2898 AD చిత్రం June 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ ధరలు భారీగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచారు. మన తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా చూడాలంటే కనీసం టికెట్ కోసం 500 ఖర్చు పెట్టాల్సిందే. అదే సింగిల్ థియేటర్లలో 200 నుంచి 300 ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా Mumbai, Delhi and Bangaloreవంటి పెద్ద నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో విడుదల రోజున టిక్కెట్ ధరలు వేలల్లో ఉంటాయి.
అలాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కల్కి సినిమా టిక్కెట్ ధర కూడా వేలల్లోనే. ముంబైలో రిలీజ్ రోజు మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా టికెట్ ధర రూ.2000 అని సమాచారం. అదే డ్రైవ్ ఇన్ థియేటర్లలో రూ.3 వేల వరకు. ఇంకా ముందుకు వెళితే ఢిల్లీ సిటీలోని మల్టీప్లెక్స్‌లో Kalki 2898 AD సినిమా టిక్కెట్ ధరలు 1300 నుండి 2000 వరకు ఉన్నాయని తెలుస్తోంది.అదే విధంగా గ్రీన్ సిటీ బెంగుళూరులో కల్కి రిలీజ్ డే టిక్కెట్లు మల్టీప్లెక్స్‌లలో 1100 నుండి 1500 వరకు ఉన్నాయి.
Hyderabadలో బెనిఫిట్ షో కోసం కొందరు కల్కి టికెట్లను బ్లాక్‌గా 3 వేల రూపాయలకు విక్రయిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. టిక్కెట్టు ధరతో సంబంధం లేకుండా అభిమానులు, సినీ ప్రియులు ప్రభాస్ పై అభిమానంతో, Kalkiపై ఉన్న అంచనాలతో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెరుచుకున్న అన్ని థియేటర్లు రిలీజ్ రోజున హౌస్ ఫుల్ షోస్ ప్రదర్శించనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న హైప్ చూస్తుంటే కల్కి సినిమా కలెక్షన్లు భారీగానే ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.