వివో ఇటీవల తన టి-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లైన వివో టి3 ప్రో, వివో టి3 అల్ట్రాపై ధర తగ్గింపును ప్రకటించింది. ఇదే సమయంలో రిపబ్లిక్ డే సేల్‌లో ఫోన్‌లు ఇంకా తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే Vivo T3 Pro 5G ఫోన్ల పై రూ.4 వేల నుండి రూ.7 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. రెండు ఫోన్లు కొన్ని నెలల క్రితమే లాంచ్ అయ్యాయి.
వివో టి3 ప్రో ఆగస్టులో లాంచ్ కాగా, వివో టి3 అల్ట్రా గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయింది. లాంచ్ సమయంలో Vivo T3 Pro ప్రారంభ ధర రూ.24,999 కాగా, Vivo T3 Ultra అత్యల్ప వేరియంట్ ధర రూ.33,999గా కంపెనీ పేర్కొంది. అయితే, ఇప్పుడు వివో ఇండియా రెండు మోడళ్లపై ధర తగ్గింపును ప్రకటించింది. రెండు పరికరాలపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ల గురించి ఇక్కడ చూద్దాం.
Related News
వివో T3 ప్రో డిస్కౌంట్ ఆఫర్
వివో టి3 ప్రో అన్ని వేరియంట్ల ధరను రూ.2,000తగ్గింది. అంటే.. రూ.24,999కి లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.22,999కి అందుబాటులో ఉంటుంది. మరోవైపు.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.26,999 నుండి రూ.24,999కి తగ్గించారు. దీనితో పాటు.. ఫోన్ పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. దీని వలన HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1500 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే MRP పరంగా చూస్తే ఈ పరికరం రూ. 7,000 చౌకగా మారింది.
వివో T3 అల్ట్రా డిస్కౌంట్ ఆఫర్
Vivo T3 Ultra గురించి మాట్లాడుకుంటే.. ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.33,999 నుండి రూ.29,999కి తగ్గింది. వివో T3 ప్రో లాగానే.. T3 అల్ట్రా కూడా కొన్ని లిస్టెడ్ బ్యాంక్ ఆఫర్‌లను కలిగి ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపుపై దాదాపు రూ. 2,000 తగ్గింపును అందిస్తుంది. ఇది మాత్రమే కాదు.. ఈ రోజుల్లో మీరు ఈ పరికరంపై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందొచ్చు. ఇది ఈ పరికరం ధరను గణనీయంగా తగ్గిస్తుంది. మంచి కండిషన్‌లో ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, రూ.10 నుంచి 15 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.