Veg Manchurian Recipe : వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లో చేయ‌డం ఎలా…?

మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు, బయటకు వెళ్లి ఏదైనా తినాలనిపిస్తుంది. ఈ రోజుల్లో, బయటకు వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే మనకు గుర్తుకు వచ్చే వాటిలో ఒకటి వెజ్ మంచూరియన్. ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మనం ప్రతిరోజూ బయట తినలేము. వెజ్ మంచూరియన్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో మరియు దానికి ఏ పదార్థాలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అవసరమైన పదార్థాలు:

1) నూనె

2) క్యాబేజీ

3) క్యారెట్

4) ఉల్లిపాయ

5) పచ్చిమిర్చి

6) బంగాళాదుంపలు

7) మైదా పిండి

8) మొక్కజొన్న పిండి

9) ఉప్పు

10) వెల్లుల్లి

11) అల్లం

12) చక్కెర

13) సోయా సాస్

14) చైనీస్ చిల్లీ పేస్ట్

15) సుగంధ పొడి

తయారీ: ముందుగా, ఒక మెత్తని గుడ్డ తీసుకొని, అందులో అర కప్పు తురిమిన క్యారెట్ మరియు అర కప్పు తురిమిన క్యాబేజీని వేసి గట్టిగా పిండి వేసి నీటిని తీసివేయండి. తరువాత ఒక గిన్నెలో తురిమిన బంగాళాదుంపలను తీసుకొని, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి, కొద్దిగా ఉప్పు, ఉడికించిన బంగాళాదుంపలను వేసి బాగా కలిపి, చిన్న చిన్న బంతులుగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి, పాన్ లో కొద్దిగా నూనె పోసి, బంతులను వేసి, అవి ఎర్రగా మారే వరకు వేయించాలి.

వాటిని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కాసేపు వేయించాలి. తర్వాత సోయా సాస్, చైనీస్ చిల్లీ పేస్ట్, సుగంధ ద్రవ్యాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని మంచూరియన్ లో వేస్తే చాలా రుచికరమైన వెజ్ మంచూరియన్ వస్తుంది.