బదిలీల్లో మీ పాఠశాలలో మీరు సర్ప్లస్ నా కదా.. ? LEAP APP లో ఒక్క క్లిక్ తో తెలుసుకోండి! మీ పాఠశాల క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంత అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖలో అనేక సాంకేతిక పరమైన పురోగాభివృద్ది జరిగింది అనేది సత్యం. గతం లో టీచర్ లు రోజు బాత్రూం ఫోటోలు అప్ లో అప్లోడ్ చేయవలసి వచ్చేది… ఆ విధానానికి ఈ ప్రభుత్వం స్వస్తి చెప్పి గురువులను బోధనకే వాడేలా చేసింది..
ఇదే కాకుండా. .మానిటరింగ్ కొరకు విద్యా శాఖలో ఉన్న అనేక రకాల యాప్ లు అన్నిటిని ఒకే మొబైల్ అప్ లా నవీకరించి ప్రస్తుతం LEAP కిందకి అందుబటులో తెచ్చింది.. ఈ కొత్త అప్ లో అనేక సేవలు ఒక్క క్లిక్ లో అందుబటులోకి తెచ్చింది.. టీచర్ల అటెండన్స్ దగ్గర నుంచి వారి శాలరీ స్లిప్ లు , APGLI వివరాలు, NOC స్టేటస్, విద్యార్థుల మార్కులు ఆన్లైన్, TIS వివరాలు సవరణలు, ఇలా అనేక రకాల సేవలు అన్ని ఒకే యాప్ లో అందుబాటులోకి తెచ్చింది..
తాజాగా ఈ నెలలోనే జరగబోవు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం సైతం ఈ యాప్ నుంచే అందించే ప్రయత్నం కూడా చేస్తుంది అని సమాచారం.
వీటన్నితో పాటు ఈ వేసవిలో టీచర్ బదిలీలలో ఏ స్కూల్ లో ఏ టీచర్ సర్ప్లస్ మరియు మీ పాఠశాల లో కొత్తగా చేసిన మార్పుల వల్ల ఎన్ని పోస్ట్లు వచ్చాయి.. ఎన్ని posts వర్కింగ్ మరియు post vacant ఖాళీ గా ఉన్నాయి అని ప్రతి టీచర్ తన పాఠశాల వివరాలు ఒక్క క్లిక్ తోనే ఈ మొబైల్ యాప్ లోనే తెలుసుకునే అవకాశం ఇచ్చారు..
LEAP APP లో పాఠశాల కు సంబంధించి వర్కింగ్ మిగులు లోటు వివరాలు చేర్చబడ్డాయి.
How to check you school cadre strength details?
- App update చేసుకొని మీ id పాస్వర్డ్ తో లాగిన్ అయి
- select – Teacher then
- – Teachers profiles view
- – Teacher analysis లో
- – view more click చేస్తే..
- మన పాఠశాల working, Required and deficit teachers వివరాలు చూపిస్తుంది.