ఇప్పుడు మీకు ₹1 లక్ష జీతం వస్తుందా? అయితే 5 ఏళ్ల తర్వాత అదే లైఫ్‌స్టైల్‌ను కొనసాగించాలంటే ₹1.25 – ₹1.5 లక్షలు కావాలి. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) మీ డబ్బు విలువను తింటూ పోతుంది.
ఇన్‌ఫ్లేషన్ అంటే ఏమిటి?
ఇప్పుడే ₹500తో మీరు కొన్ని వస్తువులు కొంటారు. మూడేళ్ల తర్వాత అదే ₹500తో అంతే వస్తువులు రాలేవు. ఎందుకంటే ధరలు పెరుగుతూనే ఉంటాయి.
- సాధారణంగా ధరలు కొద్దిగా పెరగడం (Moderate Inflation) ఆర్థిక వ్యవస్థకు మంచిది.
- అయితే అధిక ఇన్‌ఫ్లేషన్ వచ్చినప్పుడు, ధరలు ఆకాశాన్ని తాకి, సామాన్య ప్రజల జీవితాలు కష్టమవుతాయి.
ఇన్‌ఫ్లేషన్ మీ డబ్బుపై ఎంత ప్రభావం చూపుతుంది?
మీరు ఇప్పుడు ₹1 కోటి సంపాదిస్తే, అదే డబ్బు 5 ఏళ్ల తర్వాత ₹76.5 లక్షల విలువకు తగ్గిపోతుంది.
ఇలా లెక్కించండి:
*FV (Future Value) = PV (Present Value) × (1 + r (Inflation Rate))^n
అంటే, ప్రస్తుతం భారతదేశంలో ఇన్‌ఫ్లేషన్ రేటు 4.31% అయితే,
*5 ఏళ్ల తర్వాత ₹1 కోటి విలువ:
FV = ₹1,00,00,000 × (1 + 0.0431)^5
FV = ₹1,23,47,000
కనిపించే డబ్బు పెరిగినా, అసలు విలువ తగ్గిపోతుంది
ఇన్‌ఫ్లేషన్‌ను ఓడించాలంటే ఏం చేయాలి?
ఇన్వెస్ట్ చెయ్యండి. డబ్బును పెంచడానికి ఇన్వెస్టింగ్ సక్సెస్‌ఫుల్ పద్ధతి.
- ఇన్వెస్ట్‌మెంట్ వల్ల డబ్బు పెరుగుతుంది, ఇన్‌ఫ్లేషన్‌ని ఓడించొచ్చు.
- భవిష్యత్తులో మీ కొనుగోలు శక్తి తగ్గకుండా ఉంటుంది.
- కుటుంబ భవిష్యత్తు కోసం ధనాన్ని వృద్ధి చేసుకోవచ్చు.
- రిటైర్మెంట్ తర్వాత కూడా భద్రత కలిగిన జీవితం గడపొచ్చు.
ఇన్‌ఫ్లేషన్ అంటే చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు ప్లాన్ చేసుకోకపోతే, 5 ఏళ్ల తర్వాత నువ్వు సంపాదించే ₹2 లక్షలు కూడా ఇప్పుడు ₹1 లక్ష మాదిరిగానే ఉంటుంది. మీ డబ్బు గల్లంతవకుండా భద్రంగా పెంచుకోవాలంటే ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి