Tirumala: భారీగా శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

గురువారం తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.3.72 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశ్వరుడిని దర్శించుకున్నారు. వెంకన్నను పూర్తిగా దర్శనం చేసుకోవడానికి 8 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు. ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు క్యూలో నిలబడ్డారని చెబుతున్నారు. గురువారం ఒక్క రోజే 58,627 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తీవ్రమైన వేడిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేసవి దృష్ట్యా తిరుమలలోని అనేక చోట్ల కూలింగ్ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు మంచినీరు, స్నాక్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులను ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. కాలినడకన నడిచే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిరుత సంచారం దృష్ట్యా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల వార్తలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నామని, ఈ మేరకు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భక్తులకు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు మూడు రోజులు తిరుమలలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు.