Diabetes: రోజూ ఎంత సేపు నడిస్తే షుగర్​ కంట్రోల్​ అవుతుంది?

డయాబెటిక్ పేషెంట్లు రోజుకు ఎంతసేపు నడవాలి: ప్రస్తుత కాలంలో టైప్-2 మధుమేహం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా కృషి చేయాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజూ వాకింగ్ చేయడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని వెల్లడైంది. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రోజుకు ఎంతసేపు నడవాలి? వారానికి ఎంత సమయం కేటాయించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పరిశోధన వివరాలు: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 30 నిమిషాలు నడవాలని చెబుతారు. అలాగే వారం మొత్తం కాకపోయినా కనీసం వారానికి 5 రోజులు రోజుకు 30 నిమిషాలు నడవడం మంచిదని చెబుతున్నారు. ఇదే విషయం అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడింది (నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

Related News

ఇలా విభజించండి: పగటిపూట అరగంట పాటు నడవడానికి సమయం లేని వారు, అలా చేయలేని వారు భాగాలుగా విభజించండి. అంటే, మీరు నడిచే ప్రతిసారీ 10 నిమిషాలు నడవాలని సూచించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత కనీసం పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఆహారం తేలికగా జీర్ణం కావాలంటే భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు చిన్నపాటి నడక సాగించాలని కూడా చెబుతారు. అంతేకాకుండా నడక సమయంలో గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరిగి గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు: ఈ క్రమంలో నడిచే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మీ కీళ్లపై ఒత్తిడి పడకుండా ఉండటానికి మీరు సమాంతర ఉపరితలంపై నడవడం కొనసాగించాలని సూచించబడింది. ఆ తరువాత, మీరు రాళ్లపై నడవాలి మరియు మెట్లు పైకి క్రిందికి వెళ్లాలి. వాతావరణం అనుకూలిస్తే ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ కు ప్రత్యేక సమయం కేటాయించాలని చెబుతున్నారు.

నడక వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:

మంచి శరీరాకృతి: క్రమం తప్పకుండా నడవడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయని, శరీర ఆకృతి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వంగకుండా నిటారుగా నిలబడతారని వివరిస్తున్నారు. మీరు సూపర్ ఫిజిక్ కలిగి ఉంటారు.

బరువు తగ్గండి: రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. నడక వల్ల కేలరీలు ఖర్చవుతాయని, బరువు తగ్గుతుందని, కొవ్వు కూడా కరుగుతుందని వివరించారు.

చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది: నడక రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది చర్మానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. ఫలితంగా ముఖంలోని డల్ నెస్ మాయమై సహజమైన మెరుపుతో తాజాగా తయారవుతుందని వివరించారు.

గమనిక: ఇక్కడ మీకు అందించబడిన అన్ని ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కోసం మాత్రమే.  అయితే వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ పర్సనల్ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.