హోండా కొత్త లివో బైక్.. ఆ ఫీచర్ మాత్రం సూపర్!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన ఎంట్రీ లెవల్ బైక్ లివోను కొత్త OBD2B కంప్లైంట్ ఇంజిన్, కొన్ని అవసరమైన నవీకరణలతో విడుదల చేసింది. ఇది హోండా షైన్, యాక్టివా స్కూటర్లంత సేల్స్ కాలేదు. ఈ బైక్ ను యువతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ బైక్‌ను రూపొందించింది. ఇప్పుడు ఈ బైక్ వేరియంట్లు, ధర, ఇంజిన్, ఫీచర్ల గురుంచి చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ధర, వేరియంట్లు

కొత్త హోండా లివో రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 83,080గా పేర్కొంది. మరోవైపు.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 85,878గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న హోండా షోరూమ్‌లలో అందుబాటులో రానున్నాయి. ఈ బైక్ TVS స్పోర్ట్ తో పోటీ పడుతోంది.

Related News

 

కొత్త OBD2B ఇంజిన్

కొత్త హోండా లివో 110cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది కొత్త OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజన్ 8.67 బిహెచ్‌పి శక్తిని, 9.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా అందించారు. OBD2B అనేది కొత్త ఉద్గార ప్రమాణం అని అర్థం. ఇది వాహనం నుండి కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

 

డిజైన్, ఫీచర్లు

కొత్త హోండా లివో డిజైన్ అంతగా ఆకట్టుకోకపోయిన ఇది కొత్త గ్రాఫిక్స్, స్టైలిష్ బాడీ ప్యానెల్స్‌తో పాటు మస్క్యులర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 3 రంగు ఎంపికలలో లభిస్తుంది. వీటిలో పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ (ఆరెంజ్ స్ట్రిప్స్‌తో), పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ (బ్లూ స్ట్రిప్స్‌తో), పెర్ల్ సైరెన్ బ్లూ ఉన్నాయి. ఈ బైక్‌కు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. దీనిలో రైడర్ రియల్-టైమ్ మైలేజ్, ఖాళీకి దూరం, సర్వీస్ డ్యూ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ వంటి ఫీచర్లు అందించారు.