ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) అధునాతన ఫీచర్లతో కొత్త Activa 125 స్కూటర్‌ను విడుదల చేసింది.
ధర:
ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది – DLX ధర రూ. 94,422 మరియు హెచ్-స్మార్ట్ ధర రూ. 97,146. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది.
ఇంజిన్ సామర్థ్యం:
ఇది 123.99 cc కెపాసిటీ కలిగిన సింగిల్-సిలిండర్ PGM-FI ఇంజన్‌తో పనిచేస్తుంది.
ఇది 6.20 kW పవర్ మరియు 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ సదుపాయం ఉంది.
పెర్ల్ ఇగ్నోస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ ప్రెషియస్ వైట్ కలర్స్‌లలో అందుబాటులో ఉంది.
సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని HMSI తెలిపింది.