NBFC నుంచి గొప్ప అవకాశం.. కానీ ఇది సురక్షితమేనా?.. ఇప్పుడే తెలుసుకోండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అనేది భారత్‌లో చాలా మందికి భద్రమైన, నమ్మదగిన పెట్టుబడి మార్గం. బంగారం, షేర్లతో పోలిస్తే FD పెట్టుబడిని ఎక్కువ మంది సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది గ్యారంటీగా వడ్డీతో డబ్బు లభించేది. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకులు సుమారు 7.25% నుండి 8.05% వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. కానీ, NBFCలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎంతవరకు సేఫ్?

అయితే, NBFCలు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయంటే అదే సేఫ్ అనుకోవచ్చా? డబ్బు పెట్టేముందు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క వడ్డీ చూసి డబ్బు పెట్టడం మంచిదేనా అనే ప్రశ్నను ముందుగా అనుకోవాలి.

వడ్డీ రేటు చూసి పెట్టుబడి చేయకండి

ఎక్కువ వడ్డీ ఇస్తున్నదే మంచి FD అనుకునే టెంప్టేషన్ చాలా మందికి ఉంటుంది. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే చాలా NBFCలు తమకు పెట్టుబడి రాకపోతే ఎక్కువ వడ్డీ రేట్లు చూపించి ఆకర్షిస్తుంటాయి. కానీ వాటి ఫైనాన్షియల్ స్థితి బలహీనంగా ఉండొచ్చు. కాబట్టి, FD పెట్టేముందు కంపెనీ వెనుక ఉన్న స్థిరతను పరిశీలించాలి.

రిస్క్‌ను ఎలా తెలుసుకోవాలి?

NBFCల రిస్క్‌ను తెలుసుకునేందుకు అత్యంత సరైన మార్గం – క్రెడిట్ రేటింగ్ చూడడం. AAA రేటింగ్ ఉన్న NBFC అంటే అది ఫైనాన్షియల్‌గా బలంగా ఉంది, డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ. రేటింగ్ A, BBB లాంటి తక్కువ రేటింగ్ ఉన్నవాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి NBFCలు ఎక్కువ వడ్డీ చూపినా, భవిష్యత్‌లో రిపేమెంట్ కష్టాలు రావచ్చు.

సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయండి

మీరు ₹10 లక్షలు NBFC FDలో పెట్టాలనుకుంటే, 5 ఏళ్లకు 8% వడ్డీతో ₹14 లక్షలు వచ్చే అవకాశముంది. కానీ ఈ లాభం కోసం మీరు రిస్క్ తీసుకుంటున్నారో లేదో ముందుగా అర్థం చేసుకోవాలి. AAA రేటింగ్ ఉన్న NBFCల లోనే పెట్టుబడి చేయండి. అలాగే RBI ద్వారా నోటిఫై చేసిన కంపెనీలను మాత్రమే ఎంచుకోండి. స్కీమ్‌లో ముందుగా లిక్విడిటీ ఉందా లేదా, మధ్యలో డబ్బు తీసుకోవచ్చా అనే విషయాలు కూడా తెలుసుకోండి.

తీరా డబ్బు కోల్పోకుండా ముందే అప్రమత్తం కావాలి. ఎక్కువ వడ్డీకి మోజుపడి రిస్కీ NBFCల్లో FDలు పెట్టి చివరకు డబ్బు రాలేదని బాధపడే పరిస్థితి వస్తే, ఏం లాభం? అందుకే, రిటర్న్స్ కంటే ముందుగా safetyని చూడండి. ఇప్పుడే మీ ప్లాన్‌ను ఒకసారి రివ్యూ చేయండి – లేదంటే మీరు పెద్దగా లాస్ అవుతారు.