అనంతపురం జిల్లా తాడిపత్రిలో చాలా హైడ్రామా నడుస్తోంది. తాడిపత్రి జనసేన ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే విడుదలయ్యాడు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
తాడిపత్రిలో శుక్రవారం పోలీసుల తీరుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసులు దొంగలకు వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. విమర్శలపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే, అతన్ని వెంటనే విడుదల చేశారు. దీంతో “శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు విడుదల చేశారు? పోలీసులను విమర్శించినందుకు కేసు నమోదు చేశారా.. అందుకే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారా..?” అసలు పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? శ్రీకాంత్ విమర్శలపై వారు ఏమంటారు? పోలీసులు ఎందుకు వెళ్లిపోయారు? ఈ ప్రశ్నలను ప్రజలు అడుగుతున్నారు. పోలీసులు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు.