ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పుతో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. మృతదేహంపై అత్యాచారం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది.
మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫిలియా) చాలా హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం ఈ నేరానికి చట్టంలో ఎలాంటి శిక్ష లేదని కోర్టు పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..
అక్టోబర్ 18, 2018న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్‌లోని నిర్జన ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితులు నితిన్ యాదవ్, నీలకంఠం గణేష్‌లను 2018 అక్టోబర్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.. నితిన్ యాదవ్ నేరం అంగీకరించాడు. బాలికను కిడ్నాప్ చేసి.. హత్య చేశాడని చెప్పాడు.
అక్కడితో ఆగకుండా బాలిక మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వారిని ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు.
ట్రయల్ కోర్టు ప్రధాన నిందితుడు నితిన్ యాదవ్‌కు జీవిత ఖైదు విధించింది. ఆధారాలు దొరకనందుకు నీలకంఠం నగేష్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడింది. అత్యాచారం కేసులో నీలకంఠం నగేష్‌ను పరిగణనలోకి తీసుకోలేదు, ఎందుకంటే అతను బాలిక మరణం తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి విముక్తి లభించింది. దీంతో బాధితురాలి తల్లి చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. మృతదేహంపై అఘాయిత్యాలకు పాల్పడడం నేరం కాదని పేర్కొంది.