Rambha: ఒకప్పుడు దుమ్ము దులిపిన కుర్ర కారు స్వప్నం.. రిఎంట్రీ కి సిద్ధం!

Heroine Rambha

సీనియర్ హీరోయిన్ రంభ..చాలా కాలంగా అబ్బాయిల హృదయాల్లో నిలిచిపోయిన ప్రముఖ హీరోయిన్. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ, మన తెలుగు అబ్బాయిలు తమ కళ్ళ ముందు చూసే ఈ రంభలా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నారు. అప్పట్లో పాన్ ఇండియా హీరోయిన్‌గా తన స్టామినాను నిరూపించుకున్న ఈ హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1990లలో హీరోయిన్ రంభ తన అందం, నృత్యంతో అందరు స్టార్ హీరోలతో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఫేమస్ అయింది. ఇప్పుడున్న సోషల్ మీడియా..అప్పుడు ఉంటే..మనం ఆమెను పాన్ ఇండియా రంభ అని పిలిచేవాళ్ళం.

తన అందం, నటన, నృత్యంతో ఆకట్టుకున్న హీరోయిన్ రంభ. విదేశీ బ్యూటీలా కనిపించే రంభ…చాలా మందికి ఆమె తెలుగు అమ్మాయి అని తెలియదు. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు విజయలక్ష్మి. అయితే, సినిమాల్లోకి వచ్చిన తర్వాత, ఆమె తన పేరును రంభగా మార్చుకుంది.

Related News

తాజా సమాచారం ప్రకారం, హీరోయిన్ రంభ ఒక ప్రముఖ హీరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక నుంచి తెలుగు, తమిళ సినిమాల్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ ఉంది. అంతేకాకుండా, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ సినిమాతో ఆమె ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం, ఇందులో విలన్ బాబీ డియోల్ హీరోగా నటించనున్నారు.

అలాగే, తెలుగులో స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశం పొందిన ఈ బ్యూటీ, ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనుందో స్పష్టంగా తెలియదు. అయితే, దర్శకులు ఆమెకు ప్రాముఖ్యత ఉన్న మంచి పాత్రలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రంభ రీ-ఎంట్రీ కన్ఫర్మ్ అయితే, ఆమె యువ హీరోలకు సోదరి లేదా అత్త పాత్రలలో సెట్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.