ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో తగ్గింపును ప్రకటించింది. వివిధ కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు బుధవారం (మే 7) నుండి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
బ్యాంక్ ప్రకారం.. రాత్రిపూట, ఒక నెల MCLR 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9 శాతానికి తగ్గించబడింది. ఈ మూడు నెలల MCLR 15 బేసిస్ పాయింట్లు బ్యాంక్ తగ్గించి 9.05 శాతానికి, ఆరు నెలల MCLR 9.10 శాతంగా ఉంచింది. మిగిలిన సమయానికి బట్టి 9, 9.20 శాతం మధ్య ఉంటుంది. అయితే గతంలో ఇది 9.10 శాతం నుండి 9.35 శాతం మధ్య ఉన్న విషయం తెలిసిందే. వినియోగదారులు తీసుకున్న గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా రుణాలకు MCLR రేటు వర్తిస్తుంది. బ్యాంకు నుండి ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారికి, కొత్త రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేట్లు 9 శాతం నుండి ప్రారంభమవుతాయి.