పది పాసయ్యారా? తెలుగు విద్యార్ధులకి 10 వేలు స్కాలర్షిప్ లు .. త్వరగా అప్లై చేయండి. లింక్ ఇదిగో.

సరోజినీ దామోదర్ ఫౌండేషన్- ‘విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్, పదకొండు- పన్నెండు తరగతులు చదివే అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ తరపున మెంటారింగ్ ప్రోగ్రామ్లు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహి స్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు రాష్ట్రానికి నిర్దేశించిన ఈ – మెయిల్ కు దరఖాస్తులు పంపాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అర్హత:

ఏపీ/తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాల నుంచి కనీసం 90 శాతం మార్కులతో/9 CGPA స్కోర్ తో పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దర ఖాస్తు చేసుకోవచ్చు.

దివ్యాంగులకు 75 శాతం మార్కులు/7.5 సీజీపీఏ స్కోర్ చాలు.

కుటుంబ వార్షికా దాయం రెండు లక్షలు మించకూడదు.

ఎంపిక:

వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్స్ట్ చేస్తారు. వీరికి మాత్రమే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఈ-మె యిల్/ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.

స్కాలర్షిప్: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000/- స్కాలర్షిప్ ఇస్తారు. అత్యధిక స్కోర్తో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత చదువుల కోసం ఏడాదికి రూ.10,000 నుంచి రూ.75,000 వరకు స్కాలర్షిప్ అందిస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆంధ్రప్రదేశ్ లో జూన్ 7; తెలంగాణాలో జూన్ 16

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు మార్కుల పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అభ్యర్థి ఫొటో, ఇంటర్/పన్నెం డోతరగతి అడ్మిషన్ పొందిన కళాశాల వివరాలు.

అభ్యర్థుల స్క్రీనింగ్: ఆంధ్రప్రదేశ్లో జూన్ 23న, తెలంగాణలో జూలై 7 ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలు: ఆంధ్రప్రదేశ్లో జూలై 7 నుంచి 20 వరకు, తెలంగాణలో ఆగస్టు 1 నుంచి 10 వరకు

ఆంధ్రప్రదేశ్ ఈ-మెయిల్: vidyadhan.andhra@sdfoundationindia.com

తెలంగాణ ఈ-మెయిల్: vidyadhan.telangana@sdfoundationindia.com
www.vidyadhan.org/apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *