ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

ఈ నెలాఖరులోగా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయన 1992 బ్యాచ్ కు చెందినవారు, ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ హరీష్ గుప్తాను డీజీపీగా నియమించింది. ఆయన కొన్ని రోజులు ఆ పదవిలో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఆయన పదవీ విరమణ తర్వాత, 1991 బ్యాచ్‌కు చెందిన ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండవ స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *