దేశ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం కొత్తగా ప్రధాన్ మంత్రి ఆషా పథకాన్ని (PM-AASHA) ప్రారంభించింది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించేలా చేస్తారు. ఈ పథకం పేరు “అన్నదాత ఆదాయ సంరక్షణ అభియాన్” అనేలా కూడా ఉంది. దీనికోసం ప్రభుత్వం భారీగా రూ.35,000 కోట్లు కేటాయించింది.
ఈ పథకానికి ప్రధాన లక్ష్యం రైతుకు పంటకు సరైన ధర ఇవ్వడం. ఇది రైతుల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఆయిల్ సీడ్స్ లాంటి పంటలు సాగు చేయడానికి ప్రోత్సాహం కూడా ఇస్తుంది.
ఇలా ఇవ్వడం ద్వారా రైతులు స్వయం సమృద్ధిగా మారే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండేలా చేస్తూ, వ్యాపారుల చేతిలో రైతులు మోసపోకుండా చూస్తుంది.
Related News
ఈ పథకంలో ముఖ్యమైన భాగాలు రెండు ఉన్నాయి. మొదటిది “ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (PSS)”. దీని ద్వారా రైతుకు కనీస మద్దతు ధర (MSP) ఖచ్చితంగా లభించేలా చేస్తారు. రెండవది “ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF)” – మార్కెట్‌లో అకస్మాత్తుగా ధరలు పెరగకుండా నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
ఈ స్కీమ్ ద్వారా రైతులకు నిస్సందేహంగా బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. ముఖ్యంగా రాబోయే రబీ సీజన్ కోసం ఎరువులు, సాగు సామాగ్రిపై సబ్సిడీలు ఇస్తారు.
దీని వలన పంట ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తక్కువ కావడంతో రైతులు ఎక్కువ పంటలు పండించగలుగుతారు, తద్వారా దేశానికి ఆహార భద్రత పెరుగుతుంది. మరొకవైపు, ధరలు అదుపులో ఉండటం వల్ల ఉపయోగదారులకు నిత్యావసరాలు తక్కువ ధరకు అందుతాయి.
ఇంకా, ఈ పథకం వల్ల వ్యవసాయ రంగంలో కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి. దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు – ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన, కృష్ణక బంధు పథకం, పంటల బీమా పథకం, రైతుల పెన్షన్ పథకం – ఇవన్నీ కలిసి రైతుల జీవితాన్ని మరింత మెరుగుపరుస్తున్నాయి.
ఇకపై రైతులు పంట పండిస్తే చాలు – ధర మరియు, భద్రత ఉంటుంది… రూ.35,000 కోట్ల అండతో, రైతులకు ఎలాంటి ఆందోళన లేకుండా సాగు చేసే రోజులు వచ్చేశాయి..