తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ను వేగంగా అమలు చేయాలని కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి ఒక గ్రామం ఎంపిక చేసి 70,122 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పుడు మిగిలిన గ్రామాలకు కూడా లబ్ధిదారులను గుర్తించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అర్హత కలిగినవారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలని స్పష్టంగా ప్రకటించింది ప్రభుత్వం.
ఎంపిక ప్రక్రియ వేగవంతం
ఇప్పటివరకు లక్షలాది అప్లికేషన్లు వచ్చినా, చాలా గ్రామాల్లో లబ్ధిదారుల తుది ఎంపిక ఇంకా పూర్తికాలేదు. అందుకే ఈ ప్రక్రియను వేగంగా ముగించేందుకు అధికారులు స్పెషల్ ప్రణాళికను రూపొందించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రామాల వారీగా ఇళ్ల లెక్కలు
ప్రతి గ్రామానికి అవసరమైన ఇళ్ల సంఖ్యను లెక్కించారని అధికారులు తెలిపారు. అర్హులకే ఇళ్లు ఇవ్వాలని, అనర్హులను ఎలా అయినా తిప్పి పంపాలన్నది ప్రభుత్వ ధృఢనిశ్చయం. దీనిలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ కమిటీలు అధికారులు కలిసి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
Related News
తుది సమయం ఇదే?
ఈ నెల 20 తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నత స్థాయి తనిఖీలు మొదలవుతాయి. ఏప్రిల్ చివరిలోగా లేదా మే మొదటి వారంలో గ్రామ పంచాయితీల వద్ద తుది లబ్ధిదారుల జాబితా బహిరంగంగా పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా అభ్యంతరాలు చెప్పాలంటే అప్పుడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదించిన లిస్ట్ ప్రకారం, ఎంపికైనవారికి అధికారిక ఉత్తర్వులు అందజేయనున్నారు. మొత్తం ప్రక్రియ మే మొదటి వారం కల్లా పూర్తవుతుందని సమాచారం.
ప్రభుత్వం ధృఢంగా ముందుకు
ఇళ్లు నిజంగా అర్హులకే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ సారి ఎలాంటి లోపం ఉండకుండా, పూర్తిగా పారదర్శకంగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకే ప్రతి దశలో కఠినమైన తనిఖీలు, సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఇప్పటి దాకా అప్లై చేసినవారికి గుడ్ న్యూస్
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండాలంటే ఇది ఫైనల్ ఛాన్స్. ఏప్రిల్ చివరి వరకు అందరూ అప్డేట్లు తెలుసుకుంటూ ఉండాలి. మీ గ్రామ పంచాయతీలో జాబితా బయట పడితే, వెంటనే చెక్ చేయండి. ఈ స్కీమ్ ద్వారా నిజంగా ఇంటి కల నెరవేరే అవకాశాన్ని కోల్పోకండి.