రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో పార్కింగ్ ఫీజులపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. మొదటి 30 నిమిషాల పాటు పార్కింగ్ పూర్తిగా ఉచితం. 30 నిమిషాల నుండి గంట వరకు పార్కింగ్ చేసే వ్యక్తులు మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో ఏదైనా కొనుగోలు చేసినట్లుగా బిల్లులు లేదా సినిమా టిక్కెట్లను చూపిస్తే, వారికి ఎటువంటి రుసుము వర్తించదని పేర్కొంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల యజమానులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.