కేంద్రం నుంచి పెద్ద గుడ్‌న్యూస్… ఏప్రిల్ 30 లాస్ట్ డేట్…

గతంలో అప్లై చేయలేకపోయిన పేద కుటుంబాలకు మరో సువర్ణావకాశం వచ్చేసింది. ప్రధాన్ మంత్రి అవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకం కింద పక్కా ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పుడు అర్హులైన కుటుంబాలు 2025 ఏప్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మొదట ఈ పథకానికి చివరి తేదీ 2025 మార్చి 31గా నిర్ణయించగా, ఇప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తేదీని పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అప్పుడు దరఖాస్తు చేయని వారు కూడా

ఈ పథకానికి 2017-18లో ఎందుకైనా అప్లై చేయలేకపోయిన వారు ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరే ఉన్నా Awas Plus పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రతి గ్రామ పంచాయతీకి చెందిన కార్యదర్శులకు ఈ రిజిస్ట్రేషన్ పనిలో భాగస్వాములయ్యే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. వారు ఇంటింటికీ తిరుగుతూ, అర్హులైన వారి పేర్లను నమోదు చేస్తున్నారు. అంటే, ఇంటి నుంచి బయటకెళ్లాల్సిన అవసరం లేకుండానే, మీ వివరాలను నమోదు చేయించుకోవచ్చు.

ఇల్లు కట్టించుకోవాలా?

ఈ పథకం కింద అర్హులైన వారికి మొత్తం రూ.1.38 లక్షలు మూడువిడతలుగా ఇస్తారు: మొదటి విడతలో: రూ.45,000,రెండవ విడతలో: రూ.60,000,మూడవ విడతలో: రూ.33,000.

Related News

ఇదే కాదు, మన్రేగా కింద 90 రోజుల పనికి రూ.33,360 వేతనం వస్తుంది (ప్రతి రోజు రూ.374). పైగా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ నిర్మాణానికి రూ.12,000 కూడా ఇస్తారు. మొత్తం కలిపి చూస్తే, ప్రభుత్వం రూ.1.83 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇస్తుంది. ఇది ఇల్లు కట్టించుకోవాలనుకునే పేద కుటుంబాలకు గోల్డెన్ ఛాన్స్.

ఇంటి నుంచే అప్లై చేయవచ్చు

మీరు స్వయంగా మొబైల్ ఫోన్‌లో Awas Plus App డౌన్‌లోడ్ చేసి అప్లై చేయొచ్చు. లేకుంటే మీ గ్రామ కార్యదర్శి ఇంటికే వచ్చి అవసరమైన వివరాలతో అప్లికేషన్ పంపేస్తారు. అప్లై చేసే ముందు మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి – ఆధార్ కార్డు,భూమి పత్రాలు (కతా / ఖాతా),బ్యాంక్ పాస్‌బుక్,మొబైల్ నెంబర్,ఫోటో

చివరి ఛాన్స్ – మిస్ అయితే లక్షల రూపాయల నష్టం

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు లక్షల మంది పేద కుటుంబాలు లాభం పొందాయి. ఇప్పుడు మీరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఏప్రిల్ 30, 2025 లోగా మీ అప్లికేషన్ పూర్తిచేయండి. లేట్ అయితే ప్రభుత్వం ఇచ్చే రూ.1.83 లక్షల పక్కా ఇల్లు కల అసలు సాకారం కావడంలేదు…
ఇప్పుడే అప్లై చేయండి – ఇదే మీ ఇంటి కలకు మొదటి అడుగు.