గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇల్లు కనిపించాలా? ఇదిగో సులభమైన మార్గం!
ఒకప్పుడు చిరునామాలు తెలుసుకోవాలంటే ఇతరులను అడుగుతూ వెళ్లేవాళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. తెలిసిన చిరునామాకైనా మ్యాప్స్‌లో చూసుకుని వెళ్లే రోజులివి. అయితే, మనం రోజూ ఉపయోగించే ఈ మ్యాప్స్‌లో మనకు తెలియని కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి చిరునామాలు చెప్పే రోజులు పోయాయి, వెంటనే లొకేషన్ పంపించమని అడిగే వారి సంఖ్య పెరుగుతోంది. లైవ్ లొకేషన్ ఆధారంగా ఇంటి చిరునామాను చెబుతున్నారు. వ్యాపారులు కూడా తమ దుకాణాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఒక్క క్లిక్‌తో చిరునామా తెలిసిపోతుంది.
Related News
అయితే, మ్యాప్స్‌లో పెద్ద దుకాణాలు, ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌ల వివరాలే కనిపిస్తాయి. మరి మీ ఇల్లు లేదా దుకాణం మ్యాప్స్‌లో కనిపించాలంటే ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? చిన్న ఆప్షన్ ద్వారా మీ ఇంటి చిరునామాను గూగుల్‌లో కనిపించేలా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఇంటిని గూగుల్ మ్యాప్స్‌లో ఎలా చేర్చాలి?
- ముందుగా మీ ఫోన్ లేదా బ్రౌజర్లో గూగుల్ మ్యాప్స్‌ను తెరవండి.
- కింద కనిపించే ‘కాంట్రిబ్యూట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- తర్వాత ‘యాడ్ ప్లేస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ‘ప్లేస్ డీటెయిల్స్’ పేజీ తెరుచుకుంటుంది. అందులో మీ బిల్డింగ్ లేదా దుకాణం పేరు, పూర్తి చిరునామా, మీ పేరు వంటి వివరాలను అందించండి.
- ‘కేటగిరీ’ ఆప్షన్లో అపార్ట్మెంట్, రెసిడెన్షియల్, ఆఫీస్, బిజినెస్, హోటల్ వంటి ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోండి.
- మీ పూర్తి చిరునామాను ఎంటర్ చేయండి. చివరగా మ్యాప్‌లో మీ ఖచ్చితమైన లొకేషన్‌ను సెలెక్ట్ చేయండి.
- ‘యాడ్ ఫొటోస్’పై క్లిక్ చేసి మీ ఇల్లు లేదా దుకాణానికి సంబంధించిన ఫొటోలను ఎంచుకోండి.
- చివరగా ‘సబ్మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంతే, రెండు రోజుల్లో మ్యాప్స్‌లో మీ ఇంటి చిరునామా అప్డేట్ అవుతుంది.
ఇకపై ఎవరైనా మీ చిరునామా అడిగితే, గూగుల్‌లో మీ పేరు లేదా దుకాణం పేరు చెప్తే చాలు. మ్యాప్స్‌లో సెర్చ్ చేసుకుని వచ్చేస్తారు.
ముఖ్య గమనిక:
- మీరు అందించే సమాచారం ఖచ్చితంగా ఉండాలి.
- ఫొటోలు స్పష్టంగా, మీ ఇంటిని లేదా దుకాణాన్ని గుర్తించేలా ఉండాలి.
- ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత కొద్ది రోజులకు గూగుల్ మీ అడ్రస్ ను వెరిఫై చేస్తుంది.