పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వ హామీతో నడిచే ఒక భద్రమైన పొదుపు పథకం. ఈ పథకానికి గల ముఖ్య ఆకర్షణలలో ఒకటి – ఇది EEE కేటగిరీలోకి వస్తుంది. అంటే మీరు వేసే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మరియు చివరికి పొందే మొత్తమూ పూర్తిగా టాక్స్ మినహాయింపు పొందతాయి.
ఇది టాక్స్ సేవింగ్‌తో పాటు, భవిష్యత్‌కు గట్టి ఆర్థిక భద్రతను కల్పించగల పథకం. చాలా మంది దీన్ని చిన్నపాటి పెట్టుబడిగా భావిస్తారు, కానీ కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే, పెద్ద మొత్తంలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత టాక్స్ సిస్టంలో మీరు పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకుంటే, పీపీఎఫ్‌లో ₹1.5 లక్షల వరకు పెట్టుబడి మీద Income Tax Act – Section 80C కింద మినహాయింపు పొందవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా ₹1.5 లక్షలు మాత్రమే పీపీఎఫ్‌లో పెట్టొచ్చు, కానీ ఇది అక్కడితో ఆగదు. మీరు మీ భార్య లేదా భర్త పేరుపై కూడా ఒక పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. అప్పుడు మీరు రెండు ఖాతాలలో కలిపి ₹3 లక్షలు వరకు ప్రతి సంవత్సరం పెట్టుబడి చేయవచ్చు. ఈ రెండు ఖాతాలపైనా వేర్వేరు వడ్డీ లభిస్తుంది, అంటే డబుల్ లాభం.
Related News
నిపుణులు చెబుతున్నట్లు, మీరు ఇతర పెట్టుబడుల నుంచి డబ్బును మార్చి ఈ విధంగా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే, భద్రమైన వడ్డీతో పాటు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే – Section 64 ప్రకారం భార్యకు ఇచ్చే డబ్బును భర్త ఆదాయంగా పరిగణించవచ్చు, కానీ పీపీఎఫ్ పథకం టాక్స్ ఫ్రీ కాబట్టి అలాంటి క్లబ్బింగ్ ప్రావిజన్స్ లాగూ కావు.
ఇలా చూస్తే, ప్రతి సంవత్సరం మీరు మీ పేరుతో పాటు జీవిత భాగస్వామి పేరుతో కూడా పీపీఎఫ్ ఖాతా నడిపితే, రెండు ఖాతాల్లో కలిపి ₹3 లక్షలు పెట్టుబడి చేయడం ద్వారా, భవిష్యత్తులో మీరు మంచి నిధిని తయారుచేసుకోవచ్చు. వడ్డీ గరిష్టంగా ఉండే ఈ పథకం ద్వారా మీకు వృద్ధి అయిన పెట్టుబడి, భద్రతగా ఉండే వడ్డీ, అలాగే పూర్తిగా టాక్స్ ఫ్రీ అయిన లాభం లభిస్తుంది.
అందుకే, చిన్న మొత్తాలేనా అనుకుని ఆలస్యం చేయకండి – ఈరోజే పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసి, భర్త-భార్య కలిసి ప్లాన్ చేయండి. భవిష్యత్తుకు గట్టి ఆర్థిక ప్రణాళికలు ఇవే.