ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యింది. ఈ కొత్త సంవత్సరం మొదలైన వెంటనే దాదాపు కోటి మందికి పాజిటివ్ న్యూస్ వచ్చేసింది. కొత్త టాక్స్ రెజీమ్‌లో చిన్న మార్పు వల్ల ఇప్పుడు మీ జీతం పెరిగినట్టే. జీతదారులు ఒక్క చిన్న నిర్ణయం తీసుకుంటే, భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆదా చేయొచ్చు.
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొత్త రూల్స్
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారి ప్రకారం – ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షల వరకు జీతం ఉన్నవాళ్లు ఇకపై ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అంటే మొత్తంగా చూస్తే, రూ.12.75 లక్షల వరకు జీతం ఉన్నవారికి టాక్స్ ఫ్రీ బెనిఫిట్ దక్కుతుంది. గత ఏడాది వరకు ఈ లిమిట్ కేవలం రూ.7 లక్షల వరకే ఉండేది. ఇప్పుడు రూ.10 లక్షల జీతం ఉన్నవారు కూడా ఒక్క రూపాయి టాక్స్ చెల్లించకుండానే ఫుల్ సాలరీ పొందొచ్చు.
పాత టాక్స్ విధానం vs కొత్త టాక్స్ విధానం
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాత టాక్స్ విధానమా లేదా కొత్తదా అనే ఎంపిక salaried ఉద్యోగులకు ఉంటుంది. కొత్త టాక్స్ విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది కానీ పాతదాన్ని కూడా ఎంచుకునే అవకాశముంటుంది.
Related News
పాత విధానం:
- రూ.2.5 లక్షల వరకు టాక్స్ లేదు
- తర్వాత 5%, 20%, 30% స్లాబ్‌లు
- 80C (రూ.1.5 లక్షల వరకు),
- 80D (రూ.25,000 – 50,000),
- హోం లోన్ వడ్డీపై రూ.2 లక్షల వరకు డిడక్షన్‌లు ఉన్నాయి.
మీరు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), హోం లోన్ లేదా ఇతర సేవింగ్స్ చేసుకుంటే పాత విధానం బెటర్ కావచ్చు – ముఖ్యంగా రూ.15 లక్షలకి పైగా ఆదాయం ఉన్నవారికి.
కొత్త టాక్స్ విధానం ఎప్పుడు ఉపయోగపడుతుంది?
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి, కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షల జీతం ఉంటే ఎలాంటి టాక్స్ లేదు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపితే ₹12.75 లక్షల జీతం ఉన్నవారు కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇది జీతాదాయంపై మాత్రమే వర్తిస్తుంది – క్యాపిటల్ గెయిన్స్ లాంటివి టాక్సుబుల్ అవుతాయి.
కొత్త విధానం ఉపయోగకరమేనా?
CBDT ఛైర్మన్ తెలిపిన సమాచారం ప్రకారం ఇప్పటికే 75% మంది కొత్త టాక్స్ రూల్స్‌నే ఫాలో అవుతున్నారు. ఈ మార్పుతో ఆ సంఖ్య 90% నుంచి 97% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఇది మంచి అవకాశం అవుతుంది.
చివరిగా:
మీ ఆదాయం ₹12.75 లక్షల లోపే ఉంటే – ఇప్పటిదాకా మీరు ఇచ్చిన టాక్స్ మొత్తాన్ని ఇక మీ జేబులో ఉంచుకునే ఛాన్స్ వచ్చేసింది… మీరు ఏ విధానం తీసుకోవాలో ఇప్పుడు ఆలోచించండి – ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు సరైన ఎంపిక చేసుకుంటే పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.