గుడ్ న్యూస్ : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. నాలుగు రోజుల్లో మనకే..

ఊహించినట్లుగానే ఈరోజు కేరళను రుతుపవనాలు తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నైరుతి రుతుపవనాలు ఊహించిన దానికంటే ముందుగానే కేరళను తాకబోతున్నాయి. గురువారం, మే 30, 2024న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గురువారం (మే 30) ఒక రోజు ముందుగానే కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయి అని వాతావరణ శాఖ ప్రకటించింది.

వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తున్నాయని, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కేరళలో అడుగుపెట్టి నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్నారు. జూన్ 10లోపు రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా చెప్పినప్పటికీ.. వాతావరణం అనుకూలించడంతో జూన్ 5లోపే రావచ్చని వెల్లడైంది.

రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సెకండ్ లాంగ్ రేంజ్ అంచనాలో పేర్కొంది. అంతకుముందు, ఏప్రిల్‌లో విడుదల చేసిన ప్రాథమిక అంచనా సాధారణ వర్షపాతాన్ని సూచించింది. అయితే రెండో అంచనాలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 106 శాతానికి పైగా వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

రుతుపవనాల ప్రారంభం నాటికి ఎల్ నినో తటస్థ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు పురోగమిస్తున్న కొద్దీ లా నినా పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఈ రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.