
వాచ్ ప్రియులకోసమే Huawei మరోసారి బంపర్ అప్డేట్తో వచ్చేసింది. ఫిట్నెస్, హెల్త్, స్టైల్ అన్నీ ఒకే వాచ్‌లో కావాలంటే Huawei Watch Fit 4 సిరీస్ మీకోసం రెడీగా ఉంది. Huawei Watch Fit 4, Watch Fit 4 Pro అనే రెండు మోడల్స్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో విడుదలై పాపులర్ అయిన ఈ స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు మన దేశంలోను Flipkartలో అందుబాటులోకి వచ్చాయి.
Huawei Watch Fit 4 యొక్క ప్రాథమిక మోడల్ ధర ₹12,999. ఇది స్టార్టింగ్ వేరియంట్. ఇక అధునాతన ఫీచర్లతో కూడిన Huawei Watch Fit 4 Pro మోడల్ ధర ₹20,999. ఈ రెండు వాచ్‌లు కూడా స్టైలిష్ డిజైన్, సాలిడ్ బిల్డ్‌తో ఉంటాయి. కానీ ప్రస్తుతానికి Pro మోడల్‌కు సంబంధించిన లిస్టింగ్‌లో కొన్ని చిన్న తప్పిదాలు Flipkartలో కనిపిస్తున్నాయి. అందుకే కొనుగోలు చేసే ముందు మీరు మోడల్ నెంబర్లను ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.
Huawei Watch Fit 4 మోడల్ బ్లాక్, గ్రే, పర్పుల్, వైట్ వంటి స్టైలిష్ కలర్లలో వస్తోంది. ఇక Pro మోడల్ బ్లూ, గ్రీన్ (నైలాన్ స్ట్రాప్‌తో), బ్లాక్ (ఫ్లోరోఎలాస్టోమర్ స్ట్రాప్‌తో) కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
[news_related_post]Huawei Watch Fit 4 సిరీస్ రెండు మోడల్స్‌లోనూ 1.82 అంగుళాల రెక్టాంగులర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 480×408 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను అందిస్తుంది. Huawei Watch Fit 4 మోడల్లో 2000 nits బ్రైట్నెస్ అందుతుంది. ఇక Pro మోడల్లో ఇది ఏకంగా 3000 nits కు చేరుతుంది. అంటే ఎండలోనూ స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది.
Huawei Watch Fit 4 Pro మోడల్లో టైటానియం అలాయ్ బెజెల్ ఉంటుంది. మొత్తం వాచ్ బాడీ మెటల్ ఆలాయ్తో తయారవుతుంది. సైడ్‌లో రొటేటింగ్ క్రౌన్ మరియు వర్కింగ్ బటన్ ఉన్నాయి. ఇవి నావిగేషన్‌ను మరింత సులభతరం చేస్తాయి.
Huawei Watch Fit 4 సిరీస్‌కు 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ వాచ్‌ను మీరు ఈజీగా స్విమ్మింగ్, వర్షంలో వాడొచ్చు. ఇక Pro వేరియంట్‌కు IP6X డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. దీని వల్ల గాలిలో ధూళితోనూ ఇబ్బంది ఉండదు.
ఇది సాధారణంగా SpO2 (ఆక్సిజన్ లెవెల్), హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ లాంటివన్నీ చేస్తుంది. కానీ Pro మోడల్లో అదనంగా ECG సెన్సార్ ఉంది. దీని వల్ల హార్ట్ సంబంధిత సమస్యలు ముందు నుంచే గుర్తించగలుగుతారు.
Huawei Watch Fit 4 సిరీస్‌లో Huawei ప్రత్యేకంగా డెవలప్ చేసిన Sunflower Positioning System ఉంది. ఇది జీపీఎస్‌ను మరింత ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు జలక్రీడలు (వాటర్ స్పోర్ట్స్) చేస్తుంటే కూడానూ రూట్ ట్రాకింగ్ చేయగలుగుతుంది.
ఈ వాచ్‌లు Bluetooth ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. మీరు వాచ్ నుంచే ఫోన్ మ్యూజిక్ ప్లేయర్‌ను కంట్రోల్ చేయవచ్చు, కెమెరా షట్టర్‌ను ఆన్ చేయవచ్చు. అలాగే Bluetooth కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. Android, iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది.
Huawei ప్రకారం, ఈ వాచ్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులు వరకూ బ్యాటరీ ఉంటుంది. సాధారణ వాడుకలో ఇది 7 రోజుల వరకు పనికొస్తుంది. మీరు Always-On Display ఆన్ చేస్తే 4 రోజులు వరకూ బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
Huawei Watch Fit 4 సిరీస్ మీకు హెల్త్, ఫిట్నెస్, డిజైన్, ఫీచర్స్ అన్నింటినీ కలిపిన ఒక బలమైన ఆప్షన్. ₹12,999కే ఈ వాచ్ ఓ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. ఇంకా ఎక్కువ ఫీచర్ల కోసం వెతుకుతున్నవారికి Huawei Watch Fit 4 Pro ₹20,999కి బెస్ట్ డీల్. ప్రస్తుతం Flipkartలో లభ్యం కావడం వల్ల డిస్కౌంట్‌తో త్వరగా ఆర్డర్ చేయడం మంచిది. ఆలస్యం చేస్తే స్టాక్ అయిపోవచ్చు. మరి ఈ స్మార్ట్ డీల్‌ను మీ కన్ను ముందే దొరికించుకోండి.