IT రంగంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవు. ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను కూడా చాలా కంపెనీలు తొలగిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఐటీలో చేరాలనుకునే వారికి పలు కంపెనీలు శుభవార్త అందించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పెద్ద ఐటీ కంపెనీలు 90 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది.
Related News
HCL టెక్ కంపెనీ క్యాంపస్‌ల నుండి 10 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటుంది. అలాగే, విప్రో కంపెనీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోబోతోంది. మరోవైపు, ఈసారి 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు టెక్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. దీంతో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఐటీలో దాదాపు 90 వేల మంది కొత్త ఉద్యోగావకాశాలు పొందనున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో TCS 5,452 మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 11,900 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. 2022-23లో తమ కంపెనీకి 50,000 మందికి పైగా చేరగా.. 2023-2024 సంవత్సరానికి 76 శాతం తగ్గించారు. అయితే ఈసారి కొత్తగా 20 వేల మందిని నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంగ్రజ్కా తెలిపారు.