AP లో వారికి శుభవార్త .. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు వేసిన CM జగన్ .. ఎవరికో తెలుసా ..

ONGC పైప్‌లైన్‌ వల్ల ఇన్కమ్ కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి YS JAGAN గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీవితాలను పెంచే లక్ష్యంతో మరో అడుగు పడింది. International Fishermen’s Day సందర్భంగా Dr. BR Ambedkar Konaseema , Kakinada జిల్లాల్లో జీవనోపాధి కోల్పోయిన 23,458 ఫ్యామిలీలకు రూ.161.86 కోట్ల డబ్బులు CM YS JAGAN విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి VIRTUAL గా బటన్‌ నొక్కడం ద్వారా నిధులు విడుదలయ్యాయి. ONGC పైపులైన్ల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500, రూ.69,000 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. దీంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కాకపోతే తిరుపతి జిల్లా మంబట్టులో మత్స్యకారులకు మేలు జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో CM YS JAGAN పాల్గొనాల్సి ఉంది. తిరుపతి జిల్లా వాకుడు మండలం రాయదారు వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, పులికాట్‌ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణతో పాటు మరికొన్ని పనులను సీఎం జగన్‌ ప్రారంభించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నగదు విడుదల కార్యక్రమం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ONGC పైప్‌లైన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల ఖాతాల్లో సీఎం బటన్‌ నొక్కి రూ.161.86 కోట్ల నిధులు జమ చేశారు.