నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్, సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిగ్రీ, సైన్స్/ఇంజనీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్, బయోకెమిస్ట్రీలో డిగ్రీ, కెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయసు: అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: యంగ్ ప్రొఫెషనల్ I పోస్టులకు ఎంపికైతే 30,000 జీతం. యంగ్ ప్రొఫెషనల్ II పోస్టులకు ఎంపికైతే 42,000 జీతం.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా డైరెక్టర్, ICAR-CTRI, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలి.