GOOD NEWS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్..

విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ విధానాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్ కార్ల సంస్థ BYD త్వరలో హైదరాబాద్ శివార్లలో విద్యుత్ కార్ల యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ విషయంలో ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్టు స్థాపనకు భూమిని కేటాయించడానికి, వివిధ రకాల అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ శివార్లలో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం BYD కంపెనీ ప్రతినిధులకు మూడు అనువైన ప్రదేశాలను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఖరారు చేసిన వెంటనే ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. దేశంలో BYD మొదటి యూనిట్‌కు తెలంగాణ వేదిక అవుతుంది. దాదాపు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Related News

ప్రస్తుతం, BYD ఎలక్ట్రికల్ కార్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని అమ్ముతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దిగుమతి పన్ను భారం ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో దేశంలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, కార్ల అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేయడానికి కంపెనీ ప్రతినిధులు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.